న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంబటి రాయుడు సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

Ambati Rayudu Announces Retirement From International Cricket || Oneindia Telugu
Ambati Rayudu announces retirement from all forms of cricket

టీమిండియా బ్యాట్స్‌మన్, హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. అయితే ఐపీఎల్ మాత్రం ఆడుతానని రాయుడు స్పష్టం చేసాడు. తాను ఎందుకు తప్పుకుంటున్నాడో మాత్రం తెలుపలేదు.

మనస్తాపం చెంది:

మనస్తాపం చెంది:

ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంతో మనస్తాపం చెందిన రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. రాయడుకు బదులు ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించుకున్న ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించినా.. అతడి స్థానంలో యువ ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో రెండోసారీ కూడా రాయుడికి నిరాశే ఎదురైంది. అవకాశం రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాయుడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఒక్క టెస్టు మ్యాచ్ ఆడలేదు:

ఒక్క టెస్టు మ్యాచ్ ఆడలేదు:

2013లో జింబాబ్వేతో జరిగిన వన్డేతో రాయుడు అరంగేట్రం చేసాడు. ఈ ఏడాది రాంచీలో ఆస్ట్రేలియాపై చివరి వన్డే ఆడాడు. 55 వన్డేల్లో రాయుడు 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 124 నాటౌట్. ఇక 6 టీ20లలో 42 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 20. భారత పరిమిత ఓవర్ల జట్లలో కీలక ఆటగాడిగా ఉన్న రాయుడు ఇప్పటివరకు ఒక్క టెస్టులో కూడా ఆడలేదు.

ఐపీఎల్‌లో 3,300 పరుగులు:

ఐపీఎల్‌లో 3,300 పరుగులు:

రాయుడు ఐపీఎల్‌లో 147 మ్యాచ్‌ల్లో 3,300 పరుగులు చేశాడు. చివరిగా ఐపీఎల్‌ -2019లో చెన్నై సూపర్‌ కింగ్స్ తరఫున 17 మ్యాచులు ఆడిన రాయుడు 282 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ -2019లో మోస్తరు ప్రదర్శన కారణంగానే ప్రపంచకప్‌లో ఎంపిక కాలేదు. చెన్నై కంటే ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడాడు. అయితే మొత్తం 216 టీ20లలో 4584 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

హైదరాబాద్‌ కెప్టెన్‌గా:

హైదరాబాద్‌ కెప్టెన్‌గా:

టీ20, వన్డే ఫార్మాట్‌లపై మరింత దృష్టి పెట్టేందుకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు రాయుడు గత సంవత్సరమే ప్రకటించాడు. రాయుడు తన 17 సంవత్సరాల సుదీర్ఘ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో 97 మ్యాచ్‌లాడి 6151 పరుగులు చేశాడు. దాంట్లో 16 సెంచరీలతో పాటు 34 హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 210. హైదరాబాద్ తరఫున 2002లో రంజీల్లోకి అరంగేట్రం చేసిన రాయుడు.. ఆ తర్వాత రెండు జట్లు మారాడు. హైదరాబాద్‌ రంజీ జట్టుకు కెప్టెన్‌గా కూడా చేసాడు.

Story first published: Wednesday, July 3, 2019, 13:51 [IST]
Other articles published on Jul 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X