విరాట్ కోహ్లీ సంతానాన్ని.. ఆస్ట్రేలియన్ అని చెప్పుకోవచ్చు: మాజీ క్రికెటర్‌

సిడ్నీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ అలెన్ బోర్డర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. దూకుడుతో పాటు అంకిత భావంతో ఆటను ప్రేమించే కోహ్లీకి తాను వీరాభిమానని చెప్పాడు. పితృత్వ సెలవులపై కోహ్లీ ఆసీస్‌తో చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం భారత జట్టుకు తీరని లోటని పేర్కొన్నాడు. నవంబరు 27 నుంచి కంగారూలతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్ ఆడనుండగా.. తొలి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కి కోహ్లీ వచ్చేయనున్నాడు.

 కోహ్లీ సంతానాన్ని ఆస్ట్రేలియన్‌గా భావించాం:

కోహ్లీ సంతానాన్ని ఆస్ట్రేలియన్‌గా భావించాం:

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆస్ట్రేలియాలో ప్రసవిస్తుందని, దీంతో కోహ్లీ సంతానాన్ని తమ దేశానికి చెందినవారిగా పరిగణించవచ్చని ఆశించామని ఓ వర్చువల్ మీడియా సమావేశంలో అలెన్‌ బోర్డర్‌ సరదాగా వ్యాఖ్యానించాడు. డిసెంబరు 17 నుంచి 21 వరకూ అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్‌కి కోహ్లీ వచ్చేయనున్నాడు. వచ్చే జనవరిలో అనుష్క బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని కోహ్లీ ఆశిస్తున్నాడు. బీసీసీఐ కూడా అతనికి పితృత్వ సెలవుల్ని కేటాయించింది.

డెలివరీ తర్వాత:

డెలివరీ తర్వాత:

చివరి మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం కానుండడంతో.. అతని స్థానంలో అజింక్య రహానె మూడు టెస్టుల్లోనూ కెప్టెన్‌గా టీమిండియాని నడిపించబోతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. బయో-సెక్యూర్ బబుల్‌లో ఈ సిరీస్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్వహిస్తుంది. దాంతో అనుష్క శర్మ డెలివరీ తర్వాత కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియాకి వెళ్లి సిరీస్‌లో ఆడేందుకు అవకాశం లేకపోయింది. ఇక పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి రావాలనుకుంటున్న కోహ్లీ నిర్ణయాన్ని మాజీలు గౌరవిస్తున్నారు.

కోహ్లీ మనసు పెట్టి ఆడతాడు:

కోహ్లీ మనసు పెట్టి ఆడతాడు:

కోహ్లీ మనసు పెట్టి ఆడతాడు:

'విరాట్‌ కోహ్లీ తొలి టెస్టులో మాత్రమే ఆడటం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. ఇది భారత్‌కు తీరని లోటు. బ్యాట్స్‌మన్, నాయకుడిగా అతడి స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు. కోహ్లీ మనసు పెట్టి ఆడతాడు. దూకుడుతో పాటు అంకిత భావంతో అతడు ఆడే విధానం నాకు ఎంతో ఇష్టం. అతడిని భారత జట్టు ఎంతో మిస్‌ అవుతుంది. కోహ్లీ ఓ స్పెషల్ ప్లేయర్, అతడికి ఎంతో ప్రతిభ ఉంది. సానుకూల ధోరణితో ఆడుతూ జట్టును గొప్పగా నడిపిస్తాడు. టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలుస్తుందని భావిస్తున్నా' అని అలెన్ బోర్డర్‌ జోస్యం చెప్పాడు.

టీవీ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన ఐపీఎల్ 2020.. ఎంతమంది వీక్షించారంటే?

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, November 21, 2020, 13:05 [IST]
Other articles published on Nov 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X