Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీవీ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన ఐపీఎల్ 2020.. ఎంతమంది వీక్షించారంటే?

IPL 2020 viewership increased by 22 percent

ముంబై: కరోనా వైరస్ పరిస్థితుల్లో ఐపీఎల్‌ 2020ని యూఏఈ‌లో నిర్వహించారు. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగాయి. మైదానంలో అభిమానులు లేకుండా జరిగిన ఈ టోర్నీ జనాలను ఆకట్టుకుందా? లేదా? అని చాలా మంది మదిలో అనుమానం ఉండేది. అయితే వాటన్నింటిని పటాపంచలు చేసి.. ఏడాది ఐపీఎల్ వ్యూయర్‌షిప్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఐపీఎల్ 2020ని టీవీల్లో వీక్షించిన ప్రేక్షకులు సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది ఐపీఎల్ వ్యూయింగ్‌ మినిట్స్‌‌తో పోలిస్తే.. ఈ సారి ఆ సంఖ్య 23 శాతం పెరిగింది.

బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. ఐపీఎల్ 2020 సీజన్‌ టీవీ వ్యూవర్‌షిప్‌ గత ఏడాదితో పోలిస్తే ఊహించని విధంగా పెరిగింది. ఐపీఎల్ 2019 సీజన్‌కి 27.3 మిలియన్ యావరేజ్ ఇప్రెషన్స్‌రాగా.. ఐపీఎల్ 2020 సీజన్‌కి ఏకంగా 31.57 మిలియన్ యావరేజ్ ఇప్రెషన్స్‌ వచ్చాయి. ఇక గత ఏడాది 462 మిలియన్ వ్యూవర్‌షిప్‌ నమోదవగా.. ఈ ఏడాది 23 శాతం వీక్షణ పెరిగినట్లు తెలుస్తోంది. అత్యధిక టీవీ వ్యూవర్‌షిప్‌ సంపాదించిన తొలి స్పోర్ట్స్ టోర్నమెంట్‌గా ఐపీఎల్ నిలించింది.

ఐపీఎల్ 2020 సీజన్ వ్యూవర్‌షిప్ పెరిగేందుకు స్థానిక భాషల్లో టోర్నీని ప్రసారం కూడా దోహపడింది. ఇంగ్లీష్‌తో పాటు టోర్నీ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్.. హిందీ, బెంగాళి, తెలుగు, తమిళ్, కన్నడ భాషాల్లో టోర్నీని ప్రసారం చేసింది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని చాలా మంది ఇంటి దగ్గర ఉండటం, మ్యాచ్ టైమింగ్స్‌నీ అరగంట ముందుకు జరపడం కలిసొచ్చింది.

టీవీలోనే కాకుండా డిస్నీ+హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా ప్రేక్షకులు ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూశారు. హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లో వీక్షించేవారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్టు నివేదికలు వెలువడ్డాయి. అయితే స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో.. టీవీలో ఐపీఎ‌ల్‌ను వీక్షించేవారి సంఖ్య భారీగా పెరిగడానికి ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. అత్యంత రంజుగా మ్యాచులు జరగడం, సూపర్ ఓవర్లు, లీగ్ దశ చివరి మ్యాచ్‌ ముగిసే వరకూ మూడు ప్లేఆఫ్ బెర్తులపై ఉత్కంఠ నెలకొనడం కూడా వ్యూవర్‌షిప్ పెరిగేందుకు ఓ కారణం.

Story first published: Saturday, November 21, 2020, 12:18 [IST]
Other articles published on Nov 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+