న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు షాక్.. ఇంగ్లాండ్‌‌తో టెస్టు సిరీస్‌కు స్టార్ ఆటగాడు దూరం!!

All rounder Ravindra Jadeja ruled out of England Test Series
Ind vs Eng Test Series : India Announce Squad For First Two Tests Against England | Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరం అయ్యాడు. ఇక పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ జడ్డూ ఆడడం అనుమానంగానే మారిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టీ20, వన్డేల సమయానికి జడేజా పరిస్థితిని సమీక్షించిన తర్వాత బీసీసీఐ సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకుంటారట. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో గాయపడిన జడ్డేజా.. చివరి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

బొటనవేలుకు గాయం

బొటనవేలుకు గాయం

సూపర్‌ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజాను గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అతడికి తొడ కండరాలు పట్టేశాయి. అయినా వేగంగా కోలుకుని రెండో టెస్టులో బరిలోకి దిగాడు. అంతేగాక విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో మరోసారి గాయపడ్డాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ విసిరిన బంతికి అతడి బొటనవేలు విరిగింది. ఫ్రాక్చర్ అయిన జడేజా వేలుకు ఆస్ట్రేలియాలోనే సర్జరీ నిర్వహించారు. అది సక్సెస్ అయింది. జడ్డూకు కనీసం ఆరువారాల విశ్రాంతి అవసరమని బీసీసీఐ అధికారొకరు తెలిపారు.

టెస్ట్ సిరీస్‌కు దూరం

టెస్ట్ సిరీస్‌కు దూరం

గురువారం ఉదయం టీమిండియా క్రికెటర్లు భారత్‌ చేరుకున్న విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా కూడా గుజరాత్ వెళ్లిపోయాడు. అయితే రిహాబిలిటేషన్ కోసం జడేజాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ పంపనుంది. అయితే గతంలో అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం జడ్డూకు విశ్రాంతి అవసరం అయిన నేపథ్యంలోనే అతడు టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అతడు ఆడేది లేదని సెలక్టర్లు తర్వాత నిర్ణయిస్తారు.

స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్, సుందర్

స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్, సుందర్

భారత పర్యటనలో నాలుగు టెస్ట్‌లు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలను ఇంగ్లండ్ ఆడనుంది. తొలి టెస్ట్ ఫిబ్ర‌వ‌రి 5న చెన్నైలో ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే తొలి రెండు టెస్ట్‌ల కోసం బీసీసీఐ టీమ్‌ను ప్ర‌క‌టించింది. ఆస్ట్రేలియా టూర్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన విరాట్ కోహ్లీ మ‌ళ్లీ కెప్టెన్సీ వ‌హించ‌నుండ‌గా.. హార్దిక పాండ్యా, ఇషాంత్ శ‌ర్మ తిరిగి టీమ్‌లోకి వ‌చ్చారు. ఈ రెండు టెస్టులకు స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేశారు. తొలి రెండు టెస్ట్‌లు చెన్నైలో.. ఆ త‌ర్వాతి రెండు టెస్టులు, టీ20లు అహ్మ‌దాబాద్‌లోని మొతేరాలో.. మూడు వ‌న్డేలు పుణెలో జ‌ర‌గ‌నున్నాయి.

'ప్లీజ్.. ధోనీ‌తో న‌న్ను పోల్చొద్దు! నాకంటూ ప్ర‌త్యేక పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా'

Story first published: Thursday, January 21, 2021, 15:42 [IST]
Other articles published on Jan 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X