
ఢిల్లీలో అడుగుపెట్టిన పంత్
టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్‌ను మాజీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీతో పోలుస్తున్నారు. అందులోనూ బ్రిస్బేన్ టెస్ట్‌లో ధోనీ రికార్డును కూడా తిరగరాయడంతో.. ఈ పోలిక మరింత ఎక్కువైంది. అయితే పంత్ మాత్రం తనను ధోనీతో పోల్చొద్దని అంటున్నాడు. తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. గురువారం ఢిల్లీలో అడుగుపెట్టిన పంత్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తనను ధోనీతో పోల్చొద్దని కోరాడు.

ధోనీతో నన్ను పోల్చొద్దు
'ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయర్‌తో పోలుస్తుంటే.. చాలా బాగుంటుంది. కానీ నన్ను ఎవరితోనూ పోల్చడం నాకు ఇష్టం ఉండదు. ఇండియన్ క్రికెట్‌లో నాకంటూ ప్రత్యేకంగా పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా దానిపైనే. ఓ లెజెండరీ ప్లేయర్‌తో ఓ యువకుడిని పోల్చడం సరికాదు. ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడంతో జట్టు మొత్తం చాలా సంతోషంగా ఉందని నేను భావిస్తున్నాను' అని రిషబ్ పంత్ తెలిపాడు. పంత్ సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 97, బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు
రిషభ్ పంత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో వృద్ధిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. రెండో టెస్టులో మోస్తరుగా రాణించాడు. ఇక సిడ్నీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను తన దూకుడు బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించాడు.
ఆ మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన అతడు త్రుటిలో శతకం చేజార్చుకొని ఔటయ్యాడు. ఒకవేళ ఔటవ్వకుండా అలాగే బ్యాటింగ్ చేసి ఉంటే.. ఆ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించే అవకాశం ఉండేది. గబ్బా టెస్టులో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న వేళ పుజారా (56), సుందర్ (22)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే చివర్లో మరింత దూకుడుగా ఆడిన పంత్ భారత్‌కు అపురూప విజయం అందించాడు.

27 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు
నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ అరుదైన రికార్డు అందుకున్న విషయం తెలిసిందే. భారత్ తరఫున పంత్ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అంతేకాదు టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో (27) వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాజీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కన్నా పంత్ వేగంగా 1000 రన్స్ చేశాడు. పంత్ 27 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు చేయగా.. మహీ 32 ఇన్నింగ్స్‌లలో 1000 రన్స్ చేసి రెండో స్థానంలో నిలిచాడు.
ఆ ఆటగాడిని వదులుకుని ఆర్సీబీ పెద్ద తప్పుచేసింది.. వేలంలో అలాంటి ప్లేయర్ దొరకడు: గంభీర్


Click it and Unblock the Notifications












