న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెరీర్​లో ఆ రెండు ఇన్నింగ్స్​లే నా ఫేవరెట్: రహానే

Ajinkya Rahane says 2014 Lords hundred and 79 in 2015 WC my favourite knocks

ముంబై: తన క్రికెట్ కెరీర్​లో రెండు ఇన్నింగ్స్​లు అంటే తనకెంతో ఇష్టమని టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే చెప్పాడు. 2014లో లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన టెస్టులో 103 పరుగుల ఇన్నింగ్స్, 2015 ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికాపై చేసిన 79 పరుగుల ఇన్నింగ్స్​లు తన ఫేవరెట్​ అని రహానే పేర్కొన్నాడు. తాజాగా ట్విట్టర్​లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు రహానే తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చాడు.

<strong>నన్ను 'హాఫ్‌ కరోనా' అంటున్నారు.. ఇది జాత్యహంకారమే కదా: గుత్తా జ్వాల</strong>నన్ను 'హాఫ్‌ కరోనా' అంటున్నారు.. ఇది జాత్యహంకారమే కదా: గుత్తా జ్వాల

లార్డ్స్ టెస్టులో సెంచరీ:

లార్డ్స్ టెస్టులో సెంచరీ:

2014 లార్డ్స్ టెస్టులో భారత జట్టు సభ్యులు ఇబ్బందులు పడిన పిచ్​పై అజింక్య రహానే తొలి ఇన్నింగ్స్​లో అద్భుతంగా ఆడాడు. జేమ్స్ ఆండర్సన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ పేసర్లను సంమర్ధవంతగా ఎదుర్కొన్నాడు. ఓ దశలో పేసర్ భువనేశ్వర్ కుమార్​తో కలిసి జింక్స్ 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 154 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. దీంతో 28 ఏళ్ల తర్వాత ప్రతిష్ఠాత్మక లార్డ్స్​మైదానంలో భారత్ విజయం సాధించింది.

ప్రపంచకప్​లో 79 పరుగులు:

ప్రపంచకప్​లో 79 పరుగులు:

2015లో ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే ప్రపంచకప్​లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్​లో అజింక్య రహానే దూకుడుగా ఆడాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ సహా.. 60 బంతుల్లోనే జింక్స్ 79 పరుగులు చేయడంతో భారత్​ 7 వికెట్లకు 307 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ ​మాయాజం ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా 177 పరుగులకే ఆలౌటైంది.

దేశ ప్రజల్లో అవగాహన:

దేశ ప్రజల్లో అవగాహన:

మహమ్మారి కరోనా వ్యాప్తి కారణంగా క్రికెట్ టోర్నీలు నిలిచిపోయాయి. అనుకోని విశ్రాంతి ల‌భించ‌డంతో.. ఆటగాళ్లు అందరూ సరదాగా కుటుంబంతో గ‌డుపుతున్నారు. అదేసమయంలో అభిమానులతో సంభాషించడానికి ఆటగాళ్ళు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. గత నెల రోజులుగా భారత్‌ను పట్టిపీడిస్తున్న మహమ్మారి కోవిడ్ -19పై రహానే ట్విట్టర్‌లో దేశ ప్రజల్లో అవగాహన పెంచుతున్నాడు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, నిత్యం చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించాడు.

కరోనా సాయం 10 లక్షలు:

కరోనా సాయం 10 లక్షలు:

దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం అజింక్య రహానే ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తన వంతు సాయంగా రూ. 10 లక్షల రూపాయాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని రహానే సన్నిహితుడొకరు పీటీఐ వార్త సంస్థకు తెలియజేశారు. అయితే రహానే మాత్రం ఇప్పటి వరకు తాను చేసిన సాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Story first published: Wednesday, April 8, 2020, 15:07 [IST]
Other articles published on Apr 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X