న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ajaz Patel: సెహ్వాగ్ భాయ్.. ఆ రోజు నా బౌలింగ్‌ను చితక్కొట్టడం నాకింకా గుర్తుంది

Ajaz Patel Recollects Sehwag Hitting Him Out Of The Ground Even In The Nets At Oval Eden Park

ముంబై: భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 10 వికెట్లతో ప్రపంచ రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసిన విషయం తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల పడగొట్టి ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచిన ఆజాజ్‌ను ప్రతీ ఒక్కరు కొనియాడారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తనదైన శైలిలో ప్రశంసించాడు. ట్విటర్ వేదికగా ఆజాజ్ ప్రదర్శనను కొనియాడుతూ ముంబైతో ఆజాజ్‌కు ఉన్న బంధాన్ని గుర్తు చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు ఆజాజ్ పటేల్ ఇచ్చిన రిప్లే ఇప్పుడు వైరల్‌గా మారింది.

సెహ్వాగ్ ఏమన్నాడంటే..

సెహ్వాగ్ ఏమన్నాడంటే..

'క్రికెట్‌లో కష్ట సాధ్యమైనది ఏదైనా ఉందంటే అది ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం. కానీ ఆజాజ్ పటేల్ ఆ అరుదైన ఘనతను అందుకొని చరిత్ర సృష్టించాడు. ఈ రోజు అతని జీవితాంతం గుర్తుంటుంది. ముంబైలో పుట్టి ముంబైలోనే చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రాత్మకమైన రికార్డు అందుకున్న ఆజాజ్ పటేల్‌కు అభినందనలు'అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఇక దీనికి ఆజాజ్ పటేల్ ధన్యవాదాలు తెలుపుతూ సెహ్వాగ్‌తో ఉన్న ఓ తీపి జ్ఞాపకాన్ని గుర్తు చేశాడు.

చితక్కొట్టావ్.. సెహ్వాగ్..

'మీ ప్రశంసలకు ధన్యావాదాలు సెహ్వాగ్ జీ. మీతో నాకు ఓ చిన్న జ్ఞాపకం గుర్తుంది. కోల్‌కతా ఈడెన్ పార్క్ మైదానంలో నెట్ బౌలర్‌గా మీకు బౌలింగ్ చేసినప్పుడు.. నా బౌలింగ్‌ను చితక్కొట్టారు. బంతిని మైదానం బయటకు బాదారు. ఆ క్షణాలను ఎప్పటి మరిచిపోలేను'అని ఆజాజ్ పటేల్ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఆజాజ్.. ఈ అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

కుంబ్లే, జిమ్ లేకర్ తర్వాత..

కుంబ్లే, జిమ్ లేకర్ తర్వాత..

అంతకు ముందు జిమ్‌ లేకర్‌, అనిల్‌ కుంబ్లే ఈ ఘనత సాధించారు. 1956లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్‌లో 53 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసి ఈ ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత మరో 43 ఏళ్లకు అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.

కుంబ్లే తర్వాత మళ్లీ 22 ఏళ్లకు ఆజాజ్ పటేల్ ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి వికెట్‌గా మహమ్మద్ సిరాజ్‌ను ఖాతాలో వేసుకొని ఆజాజ్ పటేల్ ఈ వరల్డ్ రికార్డు అందుకున్నాడు. ఇక ఆజాజ్‌ పటేల్ ఘనతపై అనిల్‌ కుంబ్లే ట్విటర్ వేదికగా స్పందించాడు. 10 వికెట్ల క్లబ్‌లోకి స్వాగతమంటూ ట్వీట్ చేశాడు. 'ఆజాజ్ చాలా బాగా బౌలింగ్‌ చేశావు. వెల్‌కమ్‌ టూ క్లబ్‌'' అని పేర్కొన్నాడు.

 372 పరుగుల భారీ తేడాతో..

372 పరుగుల భారీ తేడాతో..

ముంబై టెస్ట్‌లో సమష్టిగా రాణించిన కోహ్లీసేన 372 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), హెన్రీ నికోల్స్(111 బంతుల్లో 8 ఫోర్లు 44), విల్ యంగ్ (41 బంతుల్లో 4 ఫోర్లతో 20), రచిన్ రవీంద్ర(50 బంతుల్లో 4 ఫోర్లతో 18) మినహా అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితయ్యారు. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేయగా.. కివీస్‌ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 276/7 స్కోర్ వద్ద డిక్లేర్‌ చేసింది. సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. రవిచంద్రన్ అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది.

Story first published: Monday, December 6, 2021, 14:34 [IST]
Other articles published on Dec 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X