'ఒకే మ్యాచ్‌లో 8 పరుగులు 6 వికెట్లు తీసిన ఏకైక బౌలర్'

Posted By:
Ajantha Mendis tops T20 bowlers

హైదరాబాద్: క్రికెట్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే బ్యాట్స్‌మెన్లకు అతడొక సింహస్వప్నం. టీ20 క్రికెట్‌లో అత్యద్భుత స్థాయిలో రెండు సార్లు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ అతడు. ఆ మిస్టరీ స్పిన్నర్ బౌలర్ మరెవరో కాదు లంక క్రికెటర్ అజంతా మెండిస్.

ఈ లంక బౌలర్ పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ అతనికి శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు, ఈ స్టార్ బౌలర్ అద్భుతమైన ప్రదర్శనను సైతం గుర్తి చేసుకుంది. 2012లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా శ్రీలంక ఫస్ట్ మ్యాచ్ జింబాబ్వేతో ఆడింది.

ఆ మ్యాచ్లో కేవలం 8 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి లంక విజయంలో కీలకపాత్ర పోషించాడు మెండిస్. ఆ మ్యాచ్ లో బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కు చేరుకున్న పరంపరను ఐసీసీ వీడియో రూపంలో పోస్ట్ చేసింది.

ఆ మ్యాచ్‌లో మిస్టరీ బౌలర్ మెండిస్ ప్రత్యర్ధి ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఐసీసీ టీ20 క్రికెట్లో ఇప్పటికీ అత్యుత్తుమ ప్రదర్శనను తన పేరిట లిఖించుకున్న మెండిస్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.

Story first published: Monday, March 12, 2018, 11:29 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి