బ్యాట్స్‌మన్ తలకు బాల్ వేయమంటున్న కోహ్లీ, వీడియో రికార్డు

Posted By:
Aim for the head, says Virat

హైదరాబాద్: ఒక్కసారి కూడా టైటిల్‌కు నోచుకోని బెంగుళూరు జట్టు పదకొండో సీజన్‌లో ట్రోఫీని సొంతం చేసుకోవాలని విరాట్ కోహ్లీ ఆరాటపడుతోంది. రెండో రోజు మ్యాచ్‌లో భాగంగా బెంగుళూరు, కోల్‌కత్తా జట్లు తలపడ్డాయి. ఈ సీజన్‌ను ఎలాగైనా గెలవాలనే ఉద్ధేశ్యంతో ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కోహ్లి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ ఎలాగైనా.. గెలవాలనే తలంపుతో కోహ్లి జట్టుని నడిపించాడు. అయితే.. మధ్య ఓవర్లలో మెరుగ్గా రాణించిన బెంగళూరు బౌలర్లు చివర్లో తేలిపోయారు. దీంతో 177 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 18.5 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి కోల్‌కతా ఛేదించేసింది.

తలని టార్గెట్ చేయమని చెబుతున్న కోహ్లీ

మ్యాచ్ మధ్య ఓవర్లలో బౌన్సర్లు వేయాలని బౌలర్లకి వరుస సూచనలు చేసిన విరాట్ కోహ్లి.. చివరికి బ్యాట్స్‌మెన్ తలని లక్ష్యంగా చేసుకుని బంతులు విసరాలంటూ సైగలు చేశాడు. అతని సూచనలు మేరకు ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, కుల్వంత్ వరుసగా షార్ట్ పిచ్ బంతుల్ని సంధించారు.

కొన్ని బంతులు కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ఉతప్ప, రసెల్‌ తలకి అత్యంత సమీపం నుంచి వెళ్లాయి. బెంగళూరు తర్వాత మ్యాచ్‌ ఏప్రిల్ 13 శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో ఆడనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 9, 2018, 15:08 [IST]
Other articles published on Apr 9, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి