న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. నువ్వు నా టార్గెట్ దాటేయాలి: షోయబ్ అక్తర్

After Virat Kohli’s Record In Pune, Shoaib Akhtar Sets Him A New Challenge
After Virat Kohli’s record in Pune, Shoaib Akhtar sets him a new challenge

హైదరాబాద్: రన్ మెషీన్ విరాట్ కోహ్లి ఎలాంటి సూపర్ ఫామ్‌లో ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. కింగ్‌ కోహ్లీ' బ్యాటింగ్‌ ధాటికి రికార్డులు చిన్నబోతున్నాయి. ఆడిన ప్రతిసారీ ఏదో ఒక ఘనత అతని సొంతం అవుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి మూడు వన్డేల్లోనూ సెంచరీలు బాది ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌ సిరీస్‌లో అతడి జోరు భీకరంగా సాగుతోంది. ఎవరు అండగా నిలబడ్డా లేకున్నా విరాట్‌ పరుగుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.

 సొంతగడ్డపై వరుసగా మూడో శతకం

సొంతగడ్డపై వరుసగా మూడో శతకం

తాజాగా సొంతగడ్డపై కరీబియన్‌ జట్టుపై వరుసగా మూడో శతకం బాదేశాడు కోహ్లీ. పుణెలో విండీస్‌పై కోహ్లి చేసిన సెంచరీ వన్డేల్లో అతనికి 38వది కావడం విశేషం. ఈ రికార్డు ఇప్పటి వరకు భారత్‌లో ఏ ఆటగాడికీ లేదు. అతని స్పీడు క్రికెట్‌లోని చాలా మంది దిగ్గజాలను ఆశ్చర్యపరుస్తున్నది. అతని ఆటను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు.

ధోనీని దాటేసి.. మూడో వన్డేలో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ

అక్తర్ ట్విటర్‌లో విరాట్‌పై ప్రశంసలు

అక్తర్ ట్విటర్‌లో విరాట్‌పై ప్రశంసలు

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ట్విటర్‌లో విరాట్‌పై ప్రశంసలు కురిపించాడు. దాహం తీరని ‘కింగ్‌ కోహ్లీ'కి రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ ఓ అరుదైన సవాల్‌ విసిరాడు. 38వ వన్డే సెంచరీ బాదిన అతడికి 120 శతకాలు ఖాతాలో వేసుకోవాలని ఓ బెంచ్‌మార్క్‌ నిర్దేశించాడు.

120 శతకాల బెంచ్‌మార్క్‌ దాటేయాలి

‘గువాహటి. విశాఖపట్నం. పుణె. వరుసగా మూడు వన్డేల్లో శతకం బాదిన కోహ్లీ మానవాతీతుడులా కనిపిస్తున్నాడు. అతడు ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు. అబ్బో.. అతడో పరుగుల యంత్రం.. దీన్నిలాగే కొనసాగించు. 120 శతకాల బెంచ్‌మార్క్‌ దాటేయాలి. ఇది నీకోసం నేను నిర్దేశిస్తున్న లక్ష్యం' అని షోయబ్‌ అక్తర్‌ ట్వీట్‌ చేశాడు. విరాట్‌ సెంచరీ కొట్టేసినా మూడో వన్డేలో భారత్‌ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

సచిన్ వంద సెంచరీల రికార్డుకు దూరంలోనే

సచిన్ వంద సెంచరీల రికార్డుకు దూరంలోనే

అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్. అలాంటిది కోహ్లికి అక్తర్ 120 సెంచరీల మార్క్‌ను లక్ష్యంగా పెట్టాడు. తన టార్గెట్‌ను కోహ్లి మించిపోవాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం కోహ్లి టెస్టుల్లో 24, వన్డేల్లో 38 సెంచరీలు చేశాడు. ఓవరాల్‌గా 62 సెంచరీలతో ఉన్నాడు. అయినా సచిన్ వంద సెంచరీల రికార్డుకు ఇంకా చాలా దూరంలోనే విరాట్ ఉన్నాడు.

Story first published: Monday, October 29, 2018, 9:25 [IST]
Other articles published on Oct 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X