న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని దాటేసి.. మూడో వన్డేలో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ

India vs West Indies: Virat Kohli 1st Indian to slam 3 successive ODI hundreds

హైదరాబాద్: రికార్డుల రారాజు.. శతకాల ధీరుడు.. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి మూడో వన్డేలో తన 38వ సెంచరీని అందుకున్నాడు. దీంతో అతని ఖాతాలో మరిన్ని రికార్డులు నమోదైయ్యాయి. వన్డేల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి భారత క్రికెటర్‌గా అతడు రికార్డులకెక్కాడు. పరుగుల్లో (ప్రస్తుతం కోహ్లి 10,183) మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని (10,150)ని అధిగమించాడు.

అంతేకాక, మ్యాచ్‌లో 66 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడి వన్డే కెరీర్‌ సగటు తొలిసారి 60ని తాకింది. పుణే మ్యాచ్‌తో 214 వన్డేలాడిన కోహ్లి ప్రస్తుతం 59.90 సగటుతో ఉన్నాడు. కానీ, సొంతగడ్డపై కోహ్లి ఎప్పుడు సెంచరీ చేసినా ఓడిపోని భారత్‌ మొదటిసారి పరాజయం చవిచూసింది.. వెస్టిండీస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన వేళ మూడో వన్డేలో భారత్‌కు ఓటమి ఎదురైంది.

284 పరుగుల ఛేదనలో భారత్‌ ఇన్నింగ్స్‌లో కోహ్లి ఆటే హైలైట్‌. భీకర ఫామ్‌లో ఉన్న అతను కళ్లు చెదిరే షాట్లతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. తొలి వన్డేలో గెలిచి.. రెండో మ్యాచ్‌ టై చేసుకున్న భారత్‌.. మూడో వన్డేలో ఓడడంతో ఐదు వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది. ఈ సిరీస్‌లో విండీస్‌కు దక్కిన తొలి విజయమిదే. నాలుగో వన్డే సోమవారం ముంబైలో జరుగుతుంది.

ఛేదనలో కోహ్లి సెంచరీల సంఖ్య 23

ఇందులో మూడు (2014- నేపియర్‌లో న్యూజిలాండ్‌పై, 2016- కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాపై, తాజాగా పుణెలో విండీస్‌పై) మ్యాచ్‌ల్లో మాత్రమే భారత్‌ ఓడింది. మొత్తమ్మీద కోహ్లి సెంచరీ చేసిన మ్యాచ్‌ల్లో ఆరుసార్లే టీమిండియా ఓడింది.

 కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు

కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు

కెప్టెన్‌గా ఒక సిరీస్‌లో అత్యధిక శతకాలు (3) సాధించిన రికార్డును కోహ్లి రెండుసార్లు (ఈ ఏడాది దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లపై) అందుకున్నాడు. గంగూలీ, డివిలియర్స్‌ రెండుసార్లు ఇలా చేశారు.

వరుసగా 3 సెంచరీలు చేసిన పదో క్రికెటర్‌ కోహ్లి

వరుసగా 3 సెంచరీలు చేసిన పదో క్రికెటర్‌ కోహ్లి

వరుసగా మూడు సెంచరీలు చేసిన పదో క్రికెటర్‌ కోహ్లి. ఈ జాబితాలో సంగక్కర (శ్రీలంక), జహీర్‌ అబ్బాస్, సయీద్‌ అన్వర్, బాబర్‌ ఆజమ్‌ (పాకిస్తాన్‌), గిబ్స్, డివిలియర్స్, క్వింటన్‌ డికాక్‌ (దక్షిణాఫ్రికా), రాస్‌ టేలర్‌(న్యూజిలాండ్‌), బెయిర్‌స్టో (ఇంగ్లండ్‌) ఉన్నారు. సంగక్కర మాత్రం వరుసగా 4 సెంచరీలు చేశాడు.

కోహ్లీకి ఇదే తొలిసారి

స్వదేశంలో కోహ్లి సెంచరీ చేసిన మ్యాచ్‌లో భారత్‌ ఓడటం ఇదే తొలిసారి. ఒకే ప్రత్యర్థి (వెస్టిండీస్‌)పై వరుసగా 4 శతకాలు చేసిన తొలి ఆటగాడు కోహ్లి. ఈ సిరీస్‌కు ముందు 2017 జూలైలో అజే యంగా 111 పరుగులు చేశాడు.

Story first published: Sunday, October 28, 2018, 6:30 [IST]
Other articles published on Oct 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X