తొలి విజయం ఎదురుచూపుల్లో ముంబై, జట్టులోకి మరో ఫేసర్‌

Written By:
New Zealand pace bowler

హైదరాబాద్: గాయం కారణంగా ఐపీఎల్-11 సీజన్ మొత్తానికి దూరమైన ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ పాట్ కమిన్స్ స్థానంలో న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నేను ముంబై ఇండియన్స్ ఎంపిక చేసుకుంది. ఈ ఏడాది జరిగిన వేలంలో కనీస ధర రూ.75లక్షలకు అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు.

అతడిని జట్టులోకి తీసుకుంటున్నట్లు అటు ఫ్రాంఛైజీ గాని ఐపీఎల్ నిర్వాహకులు గానీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ, మిల్నే మాత్రం ఇప్పటికే ముంబైకి చేరుకున్నాడు. శనివారం వాంఖడే స్టేడియంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై జట్టు ఆటగాళ్లతో కలిసి అతడు ప్రాక్టీస్ కూడా చేశాడు. గత రెండు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీశాడు.

అతని క్రికెట్ కెరీర్‌లో 70 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన మిల్నే 23.21 సగటుతో 83 వికెట్లు పడగొట్టాడు. గతేడాది నవంబర్‌లో భారత పర్యటనలో అతడు కివీస్ తరఫున ఆడాడు. సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని నమోదు చేసుకోలేకపోవడంతో జట్టులో మార్పులు చేయాలని యోచిస్తుందనడంలో సందేహమే లేదు. అయితే ఓ రకంగా కమిన్స్ స్థానం కూడా భర్తీ చేయాలనే ప్రయత్నంలో లేకపోలేదు.

సీజన్ మొదలైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఛేదనలోనే చివరి వరకూ వచ్చి ఆగిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఇప్పటి వరకు ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలలో ఆఖరి నుంచి మొదటి స్థానంలో ఉంది ఈ రోహిత్ కెప్టెన్సీలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టే. -0.174పాయింట్లతో లీగ్ మొత్తంలో కనీస స్కోరు కంటే తక్కువగా ఉంది. మంగళవారం ముంబై, బెంగళూరు జట్లు వాంఖడేలో తలపడనున్నాయి.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Sunday, April 15, 2018, 19:22 [IST]
Other articles published on Apr 15, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి