న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భారత అభిమానులు

AB de Villiers Slammed by Fans For Using Tricolour to Promote Wine Brand

హైదరాబాద్: గుండెల్లో గుడి కట్టేసుకున్న భారత్ అభిమానులే డివిలియర్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్‌మెంట్ ప్రకటించినప్పటి నుంచి మళ్లీ అతను క్రికెట్ ఆడాలని కోరుకుంటున్న అభిమానులకు ఇటీవలే ఐపీఎల్‌లో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసిన డివిలియర్స్.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వల్ల ఇలాంటి పరిస్థితి దాపరించింది.

తనకే సాధ్యమైన కళాత్మక షాట్లతో 'మిస్టర్‌ 360'గా గుర్తింపు పొందిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌.. దక్షిణాఫ్రికాకు చెందిన 'ద ఫస్ట్‌ ఎలెవన్‌' అనే వైన్‌ బ్రాండ్‌ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో డివిలియర్స్‌ ట్విట్టర‌్‌లో ఓ పోస్టు చేశారు. 'చాలా ఆసక్తిగా ఉంది. మా దేశానికి చెందిన ఓ ప్రముఖ వైన్‌ ఇప్పుడు ఢిల్లీలోనూ దొరుకుతోంది' అని డివిలియర్స్‌ పేర్కొన్నాడు.



అయితే.. వైన్‌ సీసాను ఆటో రిక్షాపై ఉంచి దాంతో పాటుగా తివర్ణ పతాకం ఉన్న ఫొటోను డివిలియర్స్ షేర్‌ చేశాడు. ఈ విషయమే అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. వైన్‌ బాటిల్‌ ఉన్న ఫొటోలో త్రివర్ణ పతాకాన్ని చేర్చడంపై భారత అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డివిలియర్స్‌ తన ఇన్‌స్టాగ్రాం ద్వారానూ ఇదేవిధంగా పోస్టు చేయడం గమనార్హం.

ఐపీఎల్‌-11 తర్వాత క్రికెట్ అన్ని ఫార్మాట్లకు డివిలియర్స్‌ వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌కు మాత్రం మరి కొన్నేళ్లు అందుబాటులో ఉంటానని అతడు స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ఈ బ్యాటింగ్ దిగ్గజం సేవలను జట్టు కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏబీని బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Story first published: Friday, July 20, 2018, 11:36 [IST]
Other articles published on Jul 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X