న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒంటి చేత్తో సిక్స్ బాదిన ఏబీ డివిలియర్స్ (వీడియో వైరల్)

IPL 2019 : AB de Villiors SIX Highlight Of The Match Against King XI Punjab || Oneindia Telugu
AB de Villiers Hit an Outrageous No-Look Six and it is Beyond Science

హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఒంటి చేత్తో బాదిన సిక్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సీజన్‌లో నిజమైన ఐపీఎల్ టీ20 మజాను పంచిన మ్యాచ్‌ల్లో ఇదొకటి. ఏబీ డివిలియర్స్ సిక్సుల మోతతో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దయింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

82 పరుగులు చేసిన డివిలియర్స్

ఈ మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 44 బంతుల్లో 3 ఫోర్లు,7 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏబీ డివిలియర్స్ ఒంటి చేత్తో బాదిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. డివిలియర్స్‌ బాదిన సిక్స్ దెబ్బకు బంతి స్టేడియం పైకప్పు పైన పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

19వ ఓవర్‌లో

ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. షమీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ ఐదో బంతిని ఏబీ డివిలియర్స్ ఒంటి చేత్తో సిక్సర్‌గా మలిచాడు. అమాంతం గాల్లోకి లేచిన బంతి ఒక్కసారిగా స్టేడియం పైకప్పు పడింది. నడుముకు పైఎత్తులో వచ్చినా ఆ బంతిని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించకపోవడంతో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

17 పరుగుల తేడాతో విజయం

కాగా, ఈ ఓవర్‌లో డివిలియర్స్ మొత్తం మూడు సిక్సర్లు బాదాడు. ఆఖరి రెండు ఓవర్లలో ఆర్సీబీ 48 పరుగులు రాబట్టడంతో బెంగళూరు 200కుపైగా పరుగులు దాటింది. అనంతరం ఆర్సీబీ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 185 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Thursday, April 25, 2019, 14:20 [IST]
Other articles published on Apr 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X