న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచూరియన్‌లో ఏబీ డివిలియర్స్ మరో రికార్డు

By Nageshwara Rao
AB de Villiers built South Africa's lead with a brisk of 80

హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ అరుదైన ఘనత సాధించాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

తద్వారా సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్స్ పార్కులో అత్యధిక టెస్టు పరుగులు నమోదు చేసిన మూడో క్రికెటర్‌గా డివిలియర్స్ గుర్తింపు సాధించాడు. సూపర్ స్టోర్స్ మైదానంలో ఇప్పటివరకు డివిలియర్స్ నమోదు చేసిన పరుగులు 1,257. ఈ జాబితాలో హాషీం ఆమ్లా(1285) అగ్రస్థానంలో ఉండగా జాక్వస్‌ కల్లిస్‌(1267)లు రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఓవర్‌నైట్‌ స్కోరు 90/2తో నాలుగో రోజైన మంగళవారం ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా డివిలియర్స్ (80), డీన్ ఎల్గర్‌(61)లు నిలకడగా ఆడి స్కోరు బోర్డుని పరిగెత్తించారు. అయితే ఇన్నింగ్స్ 42 ఓవర్‌ రెండో బంతికి డివిలియర్స్‌ని ఔట్ చేసిన షమీ.. 46వ ఓవర్‌ ఐదో బంతికి ఎల్గర్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.

ఆ తర్వాత ఇన్నింగ్స్ 47 ఓవర్‌ నాలుగో బంతికి డీకాక్‌ను షమీ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డీకాక్ (12), ఫిలాండర్ (26) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం 75 ఓవర్లకు గాను దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. క్రీజులో కేశవ్ మహారాజ్ (2), డుప్లెసిస్ (24) పరుగులతో ఉన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 16, 2018, 18:09 [IST]
Other articles published on Jan 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X