న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సఫారీలతో వన్డే సిరిస్: పైనీకు ఉద్వాసన, కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్

 Aaron Finch replaces Tim Paine as Australia ODI captain ahead of South Africa series

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ ఎంపికయ్యాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే టీ20ల్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న ఆరోన్ ఫించ్ ఇకపై వన్డేల్లో కూడా కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

<strong>బాల్ టాంపరింగ్: ఆస్ట్రేలియాపై స్లెడ్జింగ్‌కు దిగే ఆలోచన లేదన్న డుప్లెసిస్</strong>బాల్ టాంపరింగ్: ఆస్ట్రేలియాపై స్లెడ్జింగ్‌కు దిగే ఆలోచన లేదన్న డుప్లెసిస్

మరోవైపు ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైనీ, వైస్ కెప్టెన్‌ మిచెల్ మార్ష్‌పై సెలెక్టర్లు వేటు వేశారు. ఈ ఏడాది జూన్‌‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో టిమ్ పైనీ 7.2 యావరేజితో మాత్రమే పరుగులు రాబట్టడంతో సెలక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించారు. అలాగే వన్డే జట్టు నుంచి నాథన్ లియాన్‌ని తప్పించారు.

యూఏఈ వేదికగా పాకిస్థాన్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకోలేక పోయినప్పటికీ షాన్ మార్ష్ జట్టులో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ, జోష్ హెజెల్‌వుడ్‌లను సంయుక్తంగా వైస్‌కెప్టెన్లుగా సెలక్టర్లు ఎంపిక చేశారు. సఫారీ జట్టుతో ప్రకటించిన వన్డే జట్టులో పేసర్లు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్‌ తిరిగి జట్టులోకి వచ్చారు.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ పర్యటన నవంబర్ 4 నుంచి 17 వరకు జరగనుంది. పెర్త్ వేదిక నవంబర్ 4న తొలి వన్డే ప్రారంభం కానుంది.

ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, డీ ఆర్సీ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కేరీ, అస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, జోష్ హెజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, నాథన్ కౌల్టర్ నైల్, ఆడమ్ జంపా.

Story first published: Saturday, October 27, 2018, 17:52 [IST]
Other articles published on Oct 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X