న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Jasprit Bumrah vs Aaron Finch: పగోడు మెచ్చుకుంటే ఎట్టా ఉంటాదో తెలుసా! (వీడియో)

 Aaron Finch applauds Jasprit Bumrah after his unplayable yorker in IND vs AU 2nd T20

కాన్పూర్: ఆస్ట్రేలియాతో సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన చిట్టి మ్యాచ్‌లో రోహిత్ సేన చితక్కొట్టింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్లతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో కైవసం చేసుకుంది. దాంతో ఆదివారం ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు.

అరుదైన ఘటన..

అరుదైన ఘటన..

తనదైన యార్కర్లతో ప్రత్యర్థిని వణికించాడు. ఎంతలా అంటే బుమ్రా యార్కర్ ఆడలేక స్టీవ్ స్మిత్ కుప్పకూలాడు. ఆరోన్ ఫించ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుమ్రా యార్కర్‌కు ఫిదా అయిన ఫించ్.. శభాష్ అంటూ మెచ్చుకున్నాడు. ఓ బ్యాటర్ బౌలర్‌ను మెచ్చుకోవడం చాలా అరుదు. వికెట్ తీసిన ఆనందంలో బౌలర్లు చేసే సంబరాలకు విసిగిపోయి బ్యాటర్లు గొడవ పడిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ బౌలర్‌ను మెచ్చుకోవడం మాత్రం చాలా తక్కువ. ఫించ్.. బుమ్రాను మెచ్చుకోవడంతో అతనిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..?

ఇన్నింగ్స్ ఐదో ఓవర్ బౌలింగ్ చేసిన బుమ్రా.. దూకుడుగా ఆడుతున్న ఫించ్, వేడ్‌లను ఇబ్బంది పెట్టాడు. ఆ ఓవర్ చివరి బంతికి అద్భుతమైన ఫుల్ యార్కర్‌తో ఆసీస్ కెప్టెన్‌ను బౌల్డ్ చేశాడు. బుమ్రా యార్కర్‌ను ఆడలేకపోయిన ఫించ్.. తనను ఔట్ చేసిన బుమ్రాను అభినందిస్తూ మైదానాన్ని వీడాడు. చేతితో బ్యాట్‌ను కొడుతూ.. ప్రత్యర్థి బౌలర్‌ను ఆసీస్ కెప్టెన్ అభినందించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

పగోడు మెచ్చుకుంటే ఎట్టా ఉంటాదో తెలుసా!

ఈ వీడియోపై అభిమానులు సరదా కామెంట్లు చేస్తున్నారు. యార్కర్ కింగ్ బుమ్రా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు భారత బౌలర్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. బూమ్ బూమ్ బుమ్రా అంటే ఇట్లానే ఉంటుందని,పగోడైనా మెచ్చుకోవాల్సిందేనని కామెంట్ చేస్తున్నారు. పగోడు మెచ్చుకుంటే ఎట్టా ఉంటాదో తెలుసా? అనే సినిమా డైలాగ్స్ షేర్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా ఫించ్ వికెట్ పడగొట్టి 23 పరుగులు ఇచ్చాడు.

రోహిత్ విధ్వంసం..

రోహిత్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాథ్యూవేడ్(20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), ఆరోన్ ఫించ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు. హర్షల్ పటేల్ 2 ఓవర్లలో 32 పరుగులిచ్చి దారుణంగా విఫలమయ్యాడు.

అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసి మరో 4 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. దినేశ్ కార్తీక్(2 బంతుల్లో సిక్స్, ఫోర్‌తో 10 నాటౌట్) అసలు సిసలు ఫినిషింగ్ ఇచ్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, September 24, 2022, 18:20 [IST]
Other articles published on Sep 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X