న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క సిక్స్ కొట్టలేదు.. ఒక్కో పరుగు ఖరీదు రూ.10 లక్షలు!! పంజాబ్ ఆ ముగ్గురిని వదిలేయాల్సిందే!

Aakash Chopra says Kings XI Punjab should release Glen Maxwell, Sheldon Cottrell ahead of IPL 2021

ముంబై: ఏ లీగ్‌లోని ఫ్రాంఛైజీ అయినా తమ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటుంది. మంచి ప్రదర్శన చేసేవారిని ఫ్రాంఛైజీ ఎంత ధరకైనా కొనుగోలు చేస్తాయి. అయితే కొన్నిసార్లు ఆయా ఆటగాళ్లు రాణించొచ్చు.. లేదా రాణించకపోవచ్చు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయకపోతే.. ఏ ఫ్రాంఛైజీ అయినా నిరుత్సాహ పడుతుంది. తదుపరి సీజన్‌లో ఉంచాలా వద్దా అనే విషయంపై దృష్టి సారిస్తుంది. తాజాగా యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌లోనూ పలువురు ఆటగాళ్లు నిరాశ పరిచారు. ముఖ్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లు.

ఒక్కో పరుగు ఖరీదు రూ.10 లక్షలు

ఒక్కో పరుగు ఖరీదు రూ.10 లక్షలు

బ్యాటింగ్ వైఫల్యం కారణంగా చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టాప్-4లో నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌‌వెల్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. టోర్నీ మొత్తం ఆడినా.. ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. ఇక ఐపీఎల్ 2020లో అతడు చేసిన ఒక్కో పరుగు ఖరీదు రూ.10 లక్షలు అంటే ఎన్ని పరుగులు చేశాడో మనం అర్ధం చేసుకోవచ్చు. దీంతో వచ్చే సీజన్‌లో పంజాబ్‌ తరఫున ఆడేది సందేహంగా ఉంది.

 కేవలం 6 వికెట్లే

కేవలం 6 వికెట్లే

పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ తర్వాత అత్యంత ప్రమాదకర బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌. ఈ విండీస్‌ పేసర్‌ ఇటు పవర్‌ప్లేలో అటు డెత్‌ ఓవర్లలో స్పెషలిస్టు. కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టడంలో దిట్ట. అయినా రాజస్థాన్‌తో ఓ మ్యాచ్‌లో రాహుల్‌ తెవాతియా (ఒక ఓవర్‌లో 5 సిక్సులు) దెబ్బకు కుదేలైపోయాడు. ఆ దెబ్బతో 6 మ్యాచ్‌ల్లో 120 బంతులేసి 176 పరుగులిచ్చాడు. కేవలం 6 వికెట్లే తీశాడు. కాట్రెల్‌ను ఐపీఎల్ వేలంలో పంజాబ్ రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్, ఢిల్లీలతో పోటీపడి మరీ భారీ ధరకు అతణ్ని దక్కించుకుంది. ఐపీఎల్ 2020 వేలంలో పాట్ కమిన్స్ తర్వాత అత్యధిక ధర పలికిన విదేశీ బౌలర్‌గా కాట్రెల్ నిలిచాడు.

మ్యాక్స్‌‌వెల్, కాట్రెల్‌ను రిలీజ్ చేయాలి

మ్యాక్స్‌‌వెల్, కాట్రెల్‌ను రిలీజ్ చేయాలి

ఐపీఎల్ 2020లో పూర్తిగా నిరాశపరిచిన గ్లెన్ మ్యాక్స్‌‌వెల్, షెల్డన్ కాట్రెల్‌ను వచ్చే సీజన్‌‌కు జరిగే వేలానికి ముందు రిలీజ్ చేయాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సూచించాడు. ఇద్దరినీ వదులుకుంటే.. పంజాబ్ దగ్గర వేలానికి ముందు భారీ మొత్తంలో డబ్బు అందుబాటులో ఉంటుందన్నాడు. రాణించని మ్యాక్స్‌వెల్‌కు పదే పదే అవకాశాలు ఇవ్వడంతో పాటు.. క్రిస్ గేల్‌ను ఆలస్యంగా టోర్నీలో ఆడించడం లాంటి కొన్ని వింత నిర్ణయాలు పంజాబ్ తీసుకుందన్నాడు. స్పిన్నర్ ముజీబ్ రహ్మాన్, దక్షిణాఫ్రికా బౌలర్ హర్డస్ విల్‌జోయెన్‌కు కూడా పెద్దగా అవకాశం ఇవ్వలేదన్నాడు.

గేల్ ధర ఎక్కువ కాదు కాబట్టి

గేల్ ధర ఎక్కువ కాదు కాబట్టి

'ఐపీఎల్ 2020లో హర్డస్ విల్‌జోయెన్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. కాట్రెల్‌, నీషమ్‌, జోర్డాన్‌లకు కొన్ని అవకాశాలు ఇచ్చారు. బౌలర్లను పదే పదే మార్చారు. ఇక మ్యాక్స్‌వెల్ ఆకట్టుకోలేకపోవడం.. ఓవర్సీస్ బౌలర్ల నిలకడలేమి పంజాబ్‌ను దెబ్బతీసింది. దీపక్ హుడాకు కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు. వచ్చే సీజన్‌కు ముందు వేలం నిర్వహించడం పంజాబ్‌కు ఎంతో అవసరం. కాట్రెల్, హర్డస్‌తో పాటు మ్యాక్స్‌వెల్‌ను రిలీజ్ చేయడం మంచిది. గేల్ ధర ఎక్కువ కాదు కాబట్టి.. అతణ్ని అట్టిపెట్టుకోవచ్చు' అని ఆకాశ్ చోప్రా సూచించాడు.

India vs Australia: విరాట్ కోహ్లీ రికార్డుపై కన్నేసిన స్టీవ్ స్మిత్.. మరో రెండు సెంచరీలు చేస్తే!!

Story first published: Monday, November 16, 2020, 14:54 [IST]
Other articles published on Nov 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X