Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: విరాట్ కోహ్లీ రికార్డుపై కన్నేసిన స్టీవ్ స్మిత్.. మరో రెండు సెంచరీలు చేస్తే!!

Virat Kohli, Steve Smith eye batting milestones in India vs Australia Tour
IND vs AUS 2020 : Steve Smith Eyeing On Virat Kohli's Test Record

సిడ్నీ: సుదీర్ఘ పర్యటన కోసం భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే. నవంబర్‌ 27న ప్రారంభమై జనవరి 27న ముగిసే ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీసేన మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన కోసం ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు సిడ్నీలో ప్రాక్టీస్‌ ప్రారంభించింది. శనివారమే శిక్షణ ఆరంభించిన టీమిండియా.. ఆదివారం పూర్తిస్థాయి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. ఇక తొలి టెస్టు డిసెంబర్‌ 17న ప్రారంభం కానున్నా.. టెస్టు స్పెషలిస్ట్‌లు కూడా ఇప్పటి నుంచే ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు.

స్మిత్ రెండు సెంచరీలు చేస్తే

స్మిత్ రెండు సెంచరీలు చేస్తే

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ స్వదేశానికి బయల్దేరి రానున్న సంగతి తెలిసిందే. బిడ్డకు జన్మనివ్వనున్న తన భార్య అనుష్క శర్మ చెంత ఉండేందుకు సెలవు తీసుకున్న నేపథ్యంలో మిగతా మూడు టెస్టుల్లో అతడు లేకుండానే భారత జట్టు ఆసీస్‌తో తలపడనుంది. ప్రస్తుత క్రికెటర్లలో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (26) ముందుండగా.. స్టీవ్ స్మిత్ (25) తర్వాతి స్థానంలో ఉన్నాడు. తొలి టెస్టులో విరాట్ సెంచరీ చేయలేకపోయినా.. లేదా స్మిత్ మరో రెండు సెంచరీలు బాదినా.. కోహ్లీని వెనక్కి నెడతాడు. ప్రస్తుత ఆటగాళ్లలో సుదీర్ఘ ఫార్మాట్లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేస్తాడు.

రోహిత్‌ను వెనక్కి నెట్టనున్న కోహ్లీ

రోహిత్‌ను వెనక్కి నెట్టనున్న కోహ్లీ

ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య నవంబర్ 27న తొలి వన్డే జరగనుంది. ఫిట్‌గా లేకపోవడంతో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డేలు, టీ20లకు ఎంపిక కాని విషయం తెలిసిందే. దీంతో రోహిత్ లేకుండానే భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆడనుంది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఒక శతకం నమోదు చేయగలిగితే.. రోహిత్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ప్రస్తుతం వన్డేల్లో ఆస్ట్రేలియా గడ్డ మీద అత్యధిక శతకాలు నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (5), రోహిత్ శర్మ (5) అగ్రస్థానంలో ఉన్నారు. కోహ్లీ ఒక సెంచరీ చేస్తే.. రోహిత్‌‌ను వెనక్కి నెడతాడు.

కోహ్లీ రెండు సెంచరీలు బాదితే

కోహ్లీ రెండు సెంచరీలు బాదితే

ఈ టూర్‌లో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు బాదితే.. అన్ని ఫార్మాట్లూ కలిపి ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. 100 సెంచరీలతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో ఉండగా.. ఆస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (71) రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (70) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాడు. కోహ్లీ రెండో స్థానానికి చేరడం ఖాయమే అయినా.. అది ఈ టూర్‌లో జరుగుతుందో లేదో చూడాలి.

కోహ్లీపై ప్రశంసల వర్షం

కోహ్లీపై ప్రశంసల వర్షం

సిరీస్‌ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆసీస్‌ మాజీలు.. విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురపిస్తున్నారు. అతడు లేకుంటే భారత జట్టు డీలా పడుతుందని ఇప్పటికే జస్టిన్ లాంగర్‌ పేర్కొనగా.. అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేయడంలో అతడికి అతడే సాటి అని మార్క్‌ టేలర్‌ అన్నాడు. ఆసీస్‌ మరో దిగ్గజం గ్రేగ్‌ చాపెల్‌ కూడా కోహ్లీని ఆకాశానికెత్తాడు. అతడు అత్యంత ప్రభావవంతమైన ఆటగాడని పేర్కొన్నాడు.

Story first published: Monday, November 16, 2020, 14:04 [IST]
Other articles published on Nov 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+