న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క బౌన్సర్‌ ఆడకుండా సెహ్వాగ్ 8 వేల పరుగులు చేశాడు: ఆకాశ్‌ చోప్రా

Aakash Chopra recalls Virender Sehwag’s words from playing days

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌పై మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. సెహ్వాగ్ గొప్ప నిజాయతీపరుడని, అదే అతడి బలమని కొనియాడాడు. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్‌కపూర్ '22 యార్డ్స్‌' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

వీరూ ఏం చేయగలడో, ఏం చేయలేడో అనే విషయాలపై చాలా స్పష్టంగా ఉండేవాడని చెప్పాడు. అలాగే టెస్టుల్లో 8 వేలకు పైగా పరుగులు చేసినా అతనెప్పుడూ బౌన్సర్‌ బంతిని ఆడలేదని, అతడి నిబద్ధత, క్రమశిక్షణ అలాంటిదని చెప్పుకొచ్చాడు.

'మేమిద్దరం కలిసి ఆడేటప్పుడు సెహ్వాగ్‌ ఎన్నో విషయాలు పంచుకునేవాడు. ఒకవేళ బంతి మరీ ఎక్కువ స్వింగ్‌ అవుతుంటే షాట్లు ఆడలేనని చెప్పేవాడు. సెహ్వాగ్ అతని బలా, బలహీనతలపై పూర్తి అవగాహనతో ఉండేవాడు. బంతి స్వింగ్‌ అవుతుంటే ఆడటం ప్రమాదకరమని భావించి కొన్ని ఓవర్ల పాటు పరుగులు చేయకుండా అలాగే క్రీజులో ఉందామని చెప్పేవాడు.

తర్వాత అవకాశం దొరికినప్పుడు చితక్కొట్టొచ్చనే నమ్మకంతో సెహ్వాగ్‌ ఉండేవాడు. నేను ఆడేటప్పుడు బ్యాటింగ్‌లో కుదురుకున్నాక ఔటయితే.. అలా తరచూ ఔటైతే జట్టులోంచి తీసేస్తారని హెచ్చరించేవాడు. 'చోప్రా జీ ఇలా 40-40 పరుగులకు క్రీజులో కుదురుకున్నాక ఔటైతే జట్టులో నుంచి తీసేస్తారు'అని చెప్పేవాడు.'అని చోప్రా గుర్తు చేసుకున్నాడు.

కాగా, ఆకాశ్‌ చోప్రా భారత్ తరఫున 10 టెస్టులే ఆడి 437 పరుగులు చేశాడు. అందులో రెండే అర్ధశతకాలు ఉన్నాయి. దాంతో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. మరోవైపు దేశవాళి క్రికెట్‌లో మాత్రం అద్భుతమైన బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. ఇక ఐపీఎల్‌ ఆరంభంలో రెండు సీజన్లలో కలిపి కేవలం ఏడు మ్యాచ్‌లే ఆడాడు. అక్కడ కూడా విఫలమవ్వడంతో క్రికెట్‌ కామెంటేటర్‌గా మారాడు. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్న చోప్రా.. క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ.. విశ్లేషణలు చేస్తున్నాడు.

IPL 2020: టైటిల్ స్పాన్సర్ రేసులో టాటా సన్స్.. భారీ మొత్తానికి బిడ్ దాఖలు!IPL 2020: టైటిల్ స్పాన్సర్ రేసులో టాటా సన్స్.. భారీ మొత్తానికి బిడ్ దాఖలు!

Story first published: Friday, August 14, 2020, 19:29 [IST]
Other articles published on Aug 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X