న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో ధోనీ పెద్దగా చేసిందేమీ లేదు.. అయినా జట్టులో చోటేలా ఇస్తారు? బట్లర్ ఉన్నాడుగా: ఆకాశ్ చోప్రా

Aakash Chopra fire on ICC over picking MS Dhoni in the T20I team of the decade

ముంబై: భారత మాజీ టెస్ట్ క్రికెటర్ ఆకాష్ చోప్రా వ్యాఖ్యతగా, విశ్లేషకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్నాడు. తన వ్యాఖ్యానంతో ఎంతో మంది అభిమానులతో ప్రశంసలు అందుకున్న టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్..‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులతో. మహీ ఫ్యాన్స్‌ ఆకాశ్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. ధోనీపై ఆకాశ్ మరోసారి తన అక్కసు వెల్లగక్కాడమే ఇందుకు అసలు కారణం. విషయంలోకి వెళితే...

దశాబ్దపు టీ20 జట్టులో చోటు:

దశాబ్దపు టీ20 జట్టులో చోటు:

తాజాగా మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ ‌(ఐసీసీ) ఈ దశాబ్దపు జట్టు, వ్యక్తిగత పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దశాబ్దపు టీ20 జట్టులో ఎంఎస్ ధోనీకి ఐసీసీ.. వికెట్ కీపర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ చోటిచ్చింది. అయితే మహీ ఈ దశాబ్దంలో టీ20ల్లో చేసింది ఏమీ లేదని విమర్శించిన వ్యాఖ్యత ఆకాశ్ చోప్రా.. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి అతని స్థానంలో చోటిచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. మహీకి టీ20 జట్టులో చోటు ఎందుకు ఇచ్చారని ఐసీసీ ప్రశ్నించాడు. దాంతో ధోనీ అభిమానులు అతనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.

టీ20ల్లో పెద్దగా చేసిందేమీ లేదు:

టీ20ల్లో పెద్దగా చేసిందేమీ లేదు:

'ఐసీసీ దశాబ్దపు టీ20 జట్టులో ఎంఎస్ ధోనీకి చోటు దక్కడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఈ దశాబ్దంలో ధోనీ వ్యక్తిగతంగానే కాదు..జట్టు‌కి కూడా టీ20ల్లో పెద్దగా చేసింది ఏమీ లేదు. టీ20 జట్టుని ఎంపిక చేసినప్పుడు అందులో ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ లాంటి ఆటగాడు లేకపోవడం ఆశ్చర్యమే. మహీకి ఐసీసీ టీ20 జట్టులో చోటు ఎందుకు ఇచ్చిందో అర్ధంకావడం లేదు' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. జట్టు ఎంపికపై కూడా ఆకాష్ ఫైర్ అయ్యాడు. మహీ గత 10 సంవత్సరాలలో 73 టీ20లలో 1176 పరుగులు చేశాడు. ఇక ఒక్క పాకిస్తాన్ క్రికెటర్ లేకపోవడం క్రికెట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

టీ20లు ఆడని నువ్ కూడా:

టీ20లు ఆడని నువ్ కూడా:

ఎంఎస్ ధోనీకి వ్యతిరేకంగా ఆకాశ్ చోప్రా మాట్లాడడంతో.. మహీ ఫాన్స్ అతనిపై మండిపడుతున్నారు. 'ధోనీ టీ20 ప్రపంచకప్‌ అందించిన విషయం మర్చిపోయావా?' అని ఓఅభిమాని ట్వీట్ చేయగా.. 'టీ20లు ఆడని నువ్ కూడా మాట్లాడుతున్నావా?' అం మరో అభిమాని ట్వీటాడు. చోప్రా ఇలా నోరుజారడం ఇదేమీ మొదటిసారి కాదు. 2020లో టీ20 ప్రపంచకప్‌‌లో ఆడబోయే భారత్ జట్టుని అంచనా వేసిన ఆకాశ్ చోప్రా.. అందులో వికెట్ కీపర్‌‌గా కేఎల్ రాహుల్, రిజర్వ్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని ఎంపిక చేశాడు. దాంతో అప్పట్లో చోప్రాని సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన ధోనీ అభిమానులు.. పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఫాన్స్ తమకిష్టమొచ్చిన పదాలను ఉపయోగించారు. దీంతో బయపడిపోయిన ఆకాష్.. కొన్ని రోజుల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నాడు.

ఐసీసీ దశాబ్దపు టీ20 జట్టు:

ఐసీసీ దశాబ్దపు టీ20 జట్టు:

రోహిత్ శర్మ (భారత్), క్రిస్‌ గేల్ (వెస్టిండీస్), అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ (భారత్), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్, కెప్టెన్), కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్), జస్‌ప్రీత్ బుమ్రా (భారత్), లసిత్ మలింగ (శ్రీలంక).

డేవిడ్ వార్నర్‌ 'మహర్షి' టీజర్‌.. అచ్చం మహేశ్‌ బాబు‌లానే.. చూస్తే వావ్ అనాల్సిందే (వీడియో)!!

Story first published: Thursday, December 31, 2020, 14:39 [IST]
Other articles published on Dec 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X