న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6 out of 6: 2013 నుంచి ఆర్సీబీ జట్టుకు కెప్టెన్‌గా కోహ్లీ రిపోర్ట్ కార్డు

6 out of 6: Royal Challengers Bangalore touch new low in Indian Premier League

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన చేస్తోంది. టోర్నీ ఆరంభానికి ముందు ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆ జట్టు వరుస ఓటములతో చతికిలపడింది. ఇప్పటివరకు ఆ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్‌ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన రెండో జట్టుగా ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. 2013లో ఢిల్లీ డెర్‌డెవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఆరు మ్యాచుల్లోనూ ఓడిపోయింది.

వరుస ఓటముల చెత్త రికార్డు

వరుస ఓటముల చెత్త రికార్డు

ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉన్న వరుస ఓటముల చెత్త రికార్డును ఆర్సీబీ సమం చేసింది. 2013 సీజన్‌లో ఢిల్లీ డెర్‌డెవిల్స్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. కాగా, ఈ సీజన్‌లో ఆర్సీబీ వరుస ఓటములను గత సీజన్ చివరి మ్యాచ్‌తో సరి చూస్తే మొత్తం 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయినట్లు అవుతుంది. ఐపీఎల్ 2018 సీజన్‌లో ఆర్సీబీ ఆడిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.

2013లో ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ

2013లో ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ

2013లో ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు యాజమాన్యంతో పాటు ఇటు అభిమానులు సైతం అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, 2013లో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి ఏడాది 2014 సీజన్‌లో సీజన్‌లో ఆర్సీబీ ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది.

కోహ్లీ అద్భుత ప్రదర్శన చేయడంతో

కోహ్లీ అద్భుత ప్రదర్శన చేయడంతో

2015 సీజన్‌లో మాత్రం విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేయడంతో ఆర్సీబీ నాకౌట్ దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మొత్తం 505 పరుగులు చేశాడు. ఇక, 2016 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో కోహ్లీ మొత్తం 973 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. దీంతో ఆర్సీబీ ఫైనల్‌కు వెళ్లింది. అయితే, పైనల్లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.

2017లో భుజం గాయం కారణంగా

2017లో భుజం గాయం కారణంగా

ఇక, 2017లో భుజం గాయం కారణంగా విరాట్ కోహ్లీ మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో కూడా ఆర్సీబీ అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. 2018 సీజన్‌లో విరాట్ కోహ్లీ 530 పరుగులు చేసినప్పటికీ... పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ... ఆర్సీబీ జట్టుకు విజయాలను మాత్రం అందించలేకపోతున్నారు.

తొలి మ్యాచ్‌లోనే తక్కువ స్కోరుకే ఆలౌట్

తొలి మ్యాచ్‌లోనే తక్కువ స్కోరుకే ఆలౌట్

ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే తక్కువ స్కోరుకే ఆలౌటైంది. తొలి ఓటమి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ గెలుపు రుచిని చూడలేకపోయింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపై కోహ్లీ మాట్లాడాడు. "జట్టు ఓటములపై వివరణ ఇవ్వడానికి ఇంకా ఏం మిగల్లేదు. ప్రతి ఓటమిపై క్షమాపణ కోరాల్సిన పనిలేదు. ఏకాగ్రత దెబ్బతింటే మ్యాచ్‌ మీద దృష్టి పెట్టడం అసాధ్యం. మ్యాచ్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మేం ముందుగానే సూచించాం. కానీ అది జరగలేదు. జట్టుకు మీరు సూచించడానికి ఇంకా ఏం లేవు. జట్టుగా ఆటను ఆస్వాదించాలి. లేకపోతే క్రికెట్‌ ఆడలేం" అని అన్నాడు.

Story first published: Monday, April 8, 2019, 17:07 [IST]
Other articles published on Apr 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X