న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mohammad Nabi: ఐదు నిమిషాల్లో నా ఇంగ్లీష్ అయిపోతుంది.. నవ్వులు పూయిస్తున్న అఫ్గాన్‌ కెప్టెన్‌ వ్యాఖ్యలు!!

5 minute me English khatam hojayegi meri: Afghanistan captain Mohammad Nabis words goes viral

దుబాయ్: ఒమన్, యూఏఈలో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీకి నేరుగా వచ్చిన 8 జట్లలో ఆఫ్ఘనిస్థాన్ ఒక్కటి అన్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ కోసం జట్టును ప్రకటించే కొద్ది రోజుల ముందు అఫ్గాన్‌ కెప్టెన్‌గా ఉన్న రషీద్ ఖాన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కెప్టెన్, బౌలర్‌గా తాను న్యాయం చేయలేనని రషీద్ స్పష్టం చేశాడు. దాంతో అఫ్గాన్‌ జట్టు పగ్గాలను మొహమ్మద్ నబీ అందుకున్నాడు. ఇక బ్యాటింగ్‌లో నజీబుల్లా జద్రాన్‌.. బౌలింగ్‌లో ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ విజృంభించడంతో టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ ఘనంగా బోణీ కొట్టింది. అఫ్గాన్‌ మంగళవారం స్కాట్లాండ్‌ను 130 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

'ఆరో బౌలర్‌ విషయంలో భారత్ ఇప్పటికైనా కఠిన నిర్ణయం తీసుకోవాలి.. లేకపోతే టైటిల్ ఆశలు వదిలేసుకోవాలి''ఆరో బౌలర్‌ విషయంలో భారత్ ఇప్పటికైనా కఠిన నిర్ణయం తీసుకోవాలి.. లేకపోతే టైటిల్ ఆశలు వదిలేసుకోవాలి'

 ఇంగ్లీష్‌ మాట్లాడటం రాదు:

ఇంగ్లీష్‌ మాట్లాడటం రాదు:

స్కాట్లాండ్‌పై విజయం సాధించిన అనంతరం అఫ్గాన్‌ కెప్టెన్‌ మొహమ్మద్ నబీ మీడియాతో మాట్లాడేందుకు వచ్చాడు. సాధారణంగా ప్రతి మ్యాచ్‌ తర్వాత ఇరు జట్ల కెప్టెన్‌లు వచ్చి విలేకర్లతో మాట్లాడటం మామూలే. అయితే ఇక్కడే ఓ తమాషా సన్నివేశం జరిగింది. నబీకి అనర్గళంగా ఇంగ్లీష్‌ మాట్లాడటం రాదు. అయితే ఉర్దూను మాత్రం బాగా మాట్లాడగలడు. సాధారణంగా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఇంగ్లీష్ బాషలోనే ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్‌ మొదలవ్వడానికి వేచి ఉన్న సమయంలో నబీ మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి.

 ఐదు నిమిషాల్లో నా ఇంగ్లీష్ అయిపోతుంది:

ఐదు నిమిషాల్లో నా ఇంగ్లీష్ అయిపోతుంది:

వైరల్‌గా మారిన ఆ వీడియోలో అఫ్గాన్‌ కెప్టెన్‌ మొహమ్మద్ నబీ.. ఆ జట్టు మీడియా మేనేజర్‌తో మాట్లాడుతున్నాడు. అందులో ఏముందంటే.. 'మీడియాను ఎదుర్కోవడం చాలా కష్టమైన పని బ్రదర్. నేను నిజంగా చెబుతున్నా. కొంచెం టెన్షన్‌గా కూడా ఫీల్ అవుతున్నా. ఇంతకీ ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి బ్రదర్' అని మీడియా మేనేజర్‌ను నబీ అడుగుతాడు. అవతలి వ్యక్తి నుంచి వచ్చిన సమాధానానికి స్పందిస్తూ.. 'అలా అయితే ఐదు నిమిషాల్లో నా ఇంగ్లీష్ అయిపోతుంది' అని నబీ నవ్వుతూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అందరూ నవ్వులు పూయిస్తున్నారు. ఇక ఆలస్యం ఎందుకు మీరూ ఆ వీడియో చొసేయండి.

తిప్పేసిన ముజీబ్‌, రషీద్‌:

తిప్పేసిన ముజీబ్‌, రషీద్‌:

స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్‌ (34 బంతు ల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. హజ్రతుల్లా జజాయ్ (44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రహ్మానుల్లా (46; ఒక ఫోర్‌, 4 సిక్సర్లు) ధాటిగా ఆడారు. స్కాట్లాండ్‌ బౌలర్ షరీఫ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 10.2 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. అఫ్గాన్‌ స్టార్ బౌలర్లు ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ (5/20), రషీద్‌ ఖాన్‌ (4/9) చెలరేగిపోయారు.

సంచనాలు నమోదు చేస్తే:

టీ20 ఫార్మాట్‌లో తామెంత ప్రమాదకారులమో అఫ్గాన్‌ ప్లేయర్స్ మరోసారి ప్రపంచానికి చాటారు. తొలుత బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరు చేసిన అఫ్గాన్‌.. ఆపై స్పిన్‌ ఉచ్చులో బిగించి ప్రత్యర్థిని ఆలౌట్ చేశారు. ఛేదనలో తొలి మూడు ఓవర్లు మాత్రమే పోటీలో ఉన్న స్కాట్లాండ్‌.. ముజీబ్‌ చేతికి బంతి చేరడంతోనే పరాజయం అంచుల్లో కూరుకుపోయింది. గ్రోపు 2లో ఉన్న అఫ్గాన్‌.. పాకిస్తాన్, న్యూజీలాండ్, భారత్ లాంటి పటిష్ట జట్లను ఎదుర్కోవాల్సి ఉంది. పెద్ద జట్లపై కూడా సంచనాలు నమోదు చేస్తే.. నబీ సేన సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Thursday, October 28, 2021, 9:53 [IST]
Other articles published on Oct 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X