కోహ్లీ బ్యాటింగ్‌పై విమర్శలు: బాసటగా నిలిచిన బంగర్

By Nageshwara Rao

హైదరాబాద్: గత రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జట్టు అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ బాసటగా నిలిచాడు. నాలుగు టెస్టుల సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ విఫలమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసీస్ సిరిస్‌లో ఇప్పిటివరకు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరుగులు రాబట్టడంలో కోహ్లీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. బెంగుళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన 189 పరుగులకే ఆలౌటైంది.

హోమ్ సీజన్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన

హోమ్ సీజన్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన

అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు హోమ్ సీజన్‌లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శనతో అలరించిన విషయాన్ని బంగర్ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ, ఆస్ట్రేలియాపై కోహ్లీ తొలి రెండు టెస్టుల్లో రాణించలేకపోయినంత మాత్రాన అతని బ్యాటింగ్ వైఫల్యాలపై ఎవరూ విమర్శలు గుప్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.

వైఫల్యాల నుంచి కోహ్లీ పాఠాలు నేర్చుకుంటాడు

వైఫల్యాల నుంచి కోహ్లీ పాఠాలు నేర్చుకుంటాడు

వైఫల్యాల నుంచి కోహ్లీ పాఠాలు నేర్చుకుంటాడని, అదే అతని గొప్పతనమని బంగర్ పేర్కొంటూ, ఆస్ట్రేలియాతో జరుగనున్న మిగిలిన మ్యాచ్‌లలో కోహ్లీ తన స్థాయికి తగ్గట్టు రాణిస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అయితే రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన ఎన్ని పరుగులు చేస్తుందనే ప్రశ్నపై స్పందించేందుకు నిరాకరించాడు.

నాలుగు టెస్టుల సిరిస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యం

నాలుగు టెస్టుల సిరిస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యం

నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది. పూణెలో జరిగిన తొలి టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇక బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు 274 పరుగులకే అలౌటైంది. ఆసీస్‌పై 187 పరుగుల ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానేలు అర్ధసెంచరీలు

రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానేలు అర్ధసెంచరీలు

రెండో ఇన్నింగ్స్‌లో పుజారా, రహానేలు అర్ధసెంచరీలు సాధించారు. 213/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించిన టీమిండియాకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌల‌ర్లు ఝల‌క్ ఇచ్చారు. ర‌హానే 52, పుజారా 92, క‌రుణ్ నాయ‌ర్‌ 0, అశ్విన్‌లను 4 పరుగులకే పెవిలియన్‌కు చేర్చారు.

మార్చి 16 నుంచి రాంచీలో 3వ టెస్టు

మార్చి 16 నుంచి రాంచీలో 3వ టెస్టు

చివరి ఆరు వికెట్లను 36 పరుగుల వ్యవధిలోనే టీమిండియా కోల్పోవడం విశేషం. ఆస్ట్రేలియా బౌలర్లలో హెజెల్ వుడ్ 6 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, ఓకీఫ్‌లు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 16 నుంచి రాంచీలో ప్రారంభం కానుంది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, March 7, 2017, 12:44 [IST]
Other articles published on Mar 7, 2017

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X