న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నైట్‌‌రైడర్స్‌ అరుదైన ఘనత: టీ20ల్లో మూడో అత్యధిక స్కోరు

 267/2 in 20 overs: Kieron Pollard’s Trinbago Knight Riders register third highest T20 score

హైదరాబాద్: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో ట్రిన్‌బాగో నైట్‌‌రైడర్స్‌ అరుదైన ఘనత సాధించింది. టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన మూడో జట్టుగా నిలిచింది. ఈ జాబితాలో అప్ఘనిస్థాన్ 278 పరుగులతో టాప్‌లో ఉంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌ శుక్రవారం జమైకా తల్హాస్‌ జట్టుతో తలపడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. ఫలితంగా ఈ టోర్నీలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(20) త్వరగానే ఔటైనా... మరో ఓపెనర్ సిమ్మన్స్‌(86; 42 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన మున్రో(96 నాటౌట్‌; 50 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు)తో కలిసి రెండో వికెట్‌కు 124 పరుగుల్ని జోడించాడు. 16వ ఓవర్ ముగిసే సరికి నైట్‌రైడర్స్ 179/2 పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత కెప్టెన్ కీరన్ పొలార్డ్‌(45 నాటౌట్‌; 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 267 పరుగులు చేసింది.

కరీబియన్‌ లీగ్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. అనంతరం 68 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జమైకా తల్హాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులకు పరిమితమైంది. క్రిస్ గేల్‌(39), గ్లెన్‌ ఫిలిప్స్‌(62), జావెల్లె గ్లెన్‌(34 నాటౌట్‌), రామల్‌ లూయిస్‌(37 నాటౌట్‌)లు రాణించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.

Story first published: Saturday, September 14, 2019, 12:36 [IST]
Other articles published on Sep 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X