న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్‌ టోర్నీలో సచిన్.. యువరాజ్ అంత స్పెషలా..!!

2 Indian stars who won the Player of the Tournament award in World Cup

హైదరాబాద్: ప్రపంచ కప్ టోర్నీలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. జట్టు ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర కనిపించాలని తాపత్రయపడతాడు. అటువంటి జాబితాలో మనం కొంతమంది ప్లేయర్లను మాత్రమే చూస్తాం. ఇలాగే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన 1999 వరల్డ్ కప్‌లో లాన్స్ క్లూసెనర్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. 250పరుగులు సాధించిన 17 వికెట్లు పడగొట్టాడు. సనత్ జయసూర్యా.. 1996 ప్రపంచ కప్‌లో తుఫాన్ సృష్టించాడు.

ఇదే తరహాలో ఇంకొంత మంది ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకుని వన్డే వరల్డ్ కప్‌లోనే చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్ కప్ అందుకున్న వారిలో మన భారత్ క్రికెటర్లు ఇద్దరే ఉన్నారు.

1. సచిన్ టెండూల్కర్:

1. సచిన్ టెండూల్కర్:

ప్రపంచ కప్ టోర్నీల్లో సచిన్ టెండూల్కర్ ఎక్కువ పరుగులు సాధించిన రికార్డు సృష్టించాడు. 45 మ్యాచ్‌లు ఆడి 2278 పరుగులు సాధించాడు. అతని క్రికెట్ కెరీర్‌లో ఆరు సార్లు వరల్డ్ కప్‌ టోర్నీలలో మెరిశాడు. అతని తొలి ప్రపంచ కప్ టోర్నీ 1992లో ఆస్ట్రేలియా వేదికగా జరిగింది. అక్కడే మొహమ్మద్ అజారుద్దీన్ తర్వత అత్యధిక స్కోరు నమోదు చేసిన భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

2003 దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ టోర్నీలో..

2003 దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ టోర్నీలో..

అన్ని టోర్నమెంట్లలో టెండూల్కర్ బాగానే రాణించి ఎక్కువ పరుగులే చేశాడు. కానీ, ప్రత్యేకించి 2003 దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో అత్యధికంగా పరుగులు చేశాడు. 11మ్యాచ్‌లు ఆడి 673పరుగులు చేశాడు. దీంతో భారత్ ఆ టోర్నీలో ఫైనల్‌కు చేరి ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ సంవత్సరమే టెండూల్కర్‌కు టోర్నమెంట్ అవార్డు దక్కింది.

2. యువరాజ్ సింగ్:

2. యువరాజ్ సింగ్:

భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం బాగుండక అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఆల్‌రౌండర్‌గా యువరాజ్ 300కి పైగా స్కోరు చేసి 15 వికెట్లు తీశాడు. యువీ వీరోచిత ప్రదర్శనకు గానూ 28ఏళ్ల అనంతరం భారత్ ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. 2011వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

Story first published: Tuesday, November 6, 2018, 15:00 [IST]
Other articles published on Nov 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X