న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌: ఫైనల్లో ఆరుగురు బాక్సర్లు

Asian Boxing Championships: Amit Panghal, Kavinder Singh Bisht among six Indians to reach finals; L Sarita Devi wins bronze

బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ఆసియా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు దూసుకెళుతున్నారు. ఆరుగురు భారత బాక్సర్లు ఫైనల్లో అడుగుపెట్టగా.. మరో ఏడుగురు బాక్సర్లు సెమీఫైనల్లో పరాజయంపాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్లో ఆరుగురు బాక్సర్లకు కూడా పతకాలు కాయం కావడంతో మొత్తం భారత్ ఖాతాలో 13 పథకాలు చేరనున్నాయి.

ఫైనల్లో నలుగురు:

ఫైనల్లో నలుగురు:

పురుషుల విభాగంలో అమిత్‌ పంఘల్‌ (52 కేజీలు), కవిందర్‌ సింగ్‌ బిష్త్‌ (56 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), దీపక్‌ సింగ్‌ (49 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో అమిత్‌ 4-1తో జియాంగున్‌ హు (చైనా)పై.. కవిందర్‌ 4-1తో ఎంఖ్‌ అమర్‌ ఖర్‌ఖు (మంగోలియా)పై.. ఆశిష్‌ కుమార్‌ 3-2తో మౌసవీ సెయెద్‌షాహిన్‌ (ఇరాన్‌)పై విజయం సాధించారు. ఇక దీపక్‌కు తెమిర్తాస్‌ జుసుపోవ్‌ (కజకిస్తాన్‌) నుంచి వాకోవర్‌ లభించింది.

ఫైనల్లో పూజా రాణి, సిమ్రన్‌జిత్‌:

ఫైనల్లో పూజా రాణి, సిమ్రన్‌జిత్‌:

మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (64 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో పూజా రాణి 5-0తో ఫరీజా షోల్టే (కజకిస్తాన్‌)పై.. సిమ్రన్‌జిత్‌ కౌర్‌ 5-0తో మలియెవా మఫ్తునాఖోన్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలుపొందారు.

7 కాంస్య పతకాలు:

7 కాంస్య పతకాలు:

తెలుగమ్మాయి నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు) కాంస్యం సాధించింది. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో 0-5 తేడాతో గుయెన్‌తి (వియత్నాం) చేతిలో పరాజయం చెందింది. ఇతర సెమీఫైనల్స్‌లో సరితా దేవి 0-5తో వెన్‌లు యాంగ్‌ (చైనా) చేతిలో.. మనీషా 2-3తో హువాంగ్‌ సియావో వెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో.. సోనియా చహల్‌ 2-3తో నిలావన్‌ టెక్‌సుయెప్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడిపోయారు. పురుషుల విభాగంలో శివ థాపా 1-4తో జకీర్‌ సఫిలిన్‌ (కజకిస్తాన్‌) చేతిలో.. ఆశిష్‌ 0-5తో బోబో ఉస్మాన్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. గాయం కారణంగా సతీశ్‌ కుమార్‌ బరిలోకి దిగలేదు.

Story first published: Friday, April 26, 2019, 9:29 [IST]
Other articles published on Apr 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X