అంతరిక్షంలో ఆస్ట్రొనాట్స్ ఆట: వైరల్‌గా మారిన వీడియో

Posted By: Subhan
When astronauts tossed the shuttle: First badminton match played in outer space

హైదరాబాద్: అంతరిక్షంలోకి వెళ్లడమంటేనే విచిత్రం అలాంటిది అక్కడ ఆటలాడితే ఎలా ఉంటుందో.. ఈ సందేహం అందరికీ ఉంటుంది. ఈ ప్రక్రియకు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ఆస్ట్రోనాట్స్ శ్రీకారం చుట్టారు. అంతేకాదు సరదాగా వారు ఆడిన ఆట వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రాస్‌కామోస్ దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. రష్యా, అమెరికా, జపాన్‌కు చెందిన కాస్మోనాట్లు, ఆస్ట్రోనాట్లు ఈ బ్యాడ్మింటిన్ గేమ్ ఆడారు. తొలి గేమ్‌లో రష్యా జోడీ అలెగ్జాండర్ మిస్‌కురిన్, ఆంటోన్ ష్కాప్లెరోవ్.. అమెరికాకు చెందిన మార్క్ వాండె హీ, జపాన్‌కు చెందిన నొరిషిగె కనాయ్‌లతో తలపడ్డారు.

రెండు సెట్‌లుగా జరిగిన ఈ గేమ్‌లో అమెరికా ఆస్టోనాట్‌కు బదులు నాసాకు చెందిన జోసెఫ్ అకబా ఆడాడు. ఈ సరదా మ్యాచ్‌లో ఎవరు గెలిచారనే విషయాన్ని రాస్‌కామోస్ బయటపెట్టలేదు. ఫలితాన్ని ఫ్రెండ్‌షిప్ వన్ అంటూ ట్వీట్ చేశారు. ఇది అక్కడి సంస్కృతి ప్రకారం.. మ్యాచ్ డ్రా అయినట్లు అని అర్థం.

భూకక్ష్యలో బ్యాడింటన్ ఆడటం అంటే గురు గ్రహంపై జెండాను పాతినట్లు అనిపించిందని రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ మిసుర్కిన్ పేర్కొన్నారు. మున్ముందు తయారుచేయబోయే స్పేస్ షిప్‌లలో ఈ తరహా ఆటలు ఆడేందుకు ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి. తద్వారా మెంటల్ రిలాక్సేషన్ పొందుతారని నాసాకు చెందిన వాండె హే వ్యాఖ్యానించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 7, 2018, 17:26 [IST]
Other articles published on Feb 7, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి