న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాచ్ ఆడలేను: నాసిరకం కోర్టులపై సైనా నెహ్వాల్ అసంతృప్తి

Saina Nehwal refuses to play in Nationals citing poor playing surface

హైదరాబాద్: గౌహతి వేదికగా సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు ఆడతుండటంతో టోర్నీకి కొత్త కళ వచ్చింది. అయితే, కోర్టులు నాసిరకంగా ఉండటంతో వెటరన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ సహా మరో ఇద్దరి మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

బౌలర్ అప్పీల్‌ను తిరస్కరించిన అంఫైర్: తెరపైకి కొత్త డీఆర్ఎస్ వివాదంబౌలర్ అప్పీల్‌ను తిరస్కరించిన అంఫైర్: తెరపైకి కొత్త డీఆర్ఎస్ వివాదం

ఆటగాళ్లు ఆడాల్సిన కోర్టులు సమతలంగా లేకపోవడంతో సైనా, ఆమె భర్త పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్‌ మ్యాచ్‌లను నిర్వాహకులు వాయిదా వేశారు. కోర్టు ఉపరితలంలో అక్కడక్కడ గుంతలు, కొన్ని చోట్ల చెక్కలు తేలినట్లు ఉండటంతో సైనా నెహ్వాల్ మ్యాచ్‌ ఆడనని నిరసన వ్యక్తం చేసింది.

మార్చి నెలలో ఆల్‌ ఇంగ్లాండ్‌ చాంపియన్‌షిప్‌ జరుగనున్న నేపథ్యంలో నాసిరకమైన ఎగుడుదిగుడుగా ఉన్న కోర్టుపై తాను రిస్క్‌ తీసుకోలేనని సైనా స్పష్టం చేసింది. "సింధు మ్యాచ్‌ ముగిశాక సర్ఫేస్‌ దెబ్బతినడంతో ఆట కుదరదని చెప్పేశాం. నిర్వాహకులు సమస్యని చక్కదిద్దేందుకు సిద్ధమయ్యారు. దీంతో మా ముగ్గురి మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి" అని కశ్యప్‌ తెలిపాడు.

సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీని అస్సాం బ్యాడ్మింటన్ అకాడమీలోని మూడు కోర్టుల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. దీంతో భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఈవెంట్స్‌ కార్యదర్శి ఒమర్‌ రషీద్‌ వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు. టోర్నీకి మరో వేదికైన టీఆర్పీ ఇండోర్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు.

Story first published: Friday, February 15, 2019, 9:39 [IST]
Other articles published on Feb 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X