న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PV Sindhu fires on Umpire: పాపం సింధు.. అంపైర్ తప్పిదానికి బలి! (వైరల్ వీడియో)

PV Sindhu fires on Umpire after She Loses Badminton Asia Championships Semi-Finals To Akane Yamaguchi

న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్​లో బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో ఒలింపిక్ మెడలిస్ట్ సింధు 21-13, 19-21, 16-21 తేడాతో జపాన్ ప్లేయర్ యమగూచి చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో ఆధ్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన సింధు.. కీలక సెమీఫైనల్లో అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం తనకు అన్యాయం జరిగిందంటూ అంపైర్ల తీరుపై ఈ మాజీ ప్రపంచ చాంఫియన్ అసహనం వ్యక్తం చేసింది.

అసలేం జరిగిందంటే..?

ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను 21-13తో సునాయసంగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ 14-11తో ఆధిక్యంలో నిలిచింది. అయితే సర్వీస్ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నావని, చైర్ అంపైర్ సింధుకు పెనల్టీ పాయింట్ విధిస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన సింధు.. అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. ప్రత్యర్థి సిద్దంగా లేకపోవడంతోనే తాను సర్వీస్ ఆలస్యంగా చేయాల్సి వచ్చిందని వివరించినా రిఫరీ పట్టించుకోలేదు. చీఫ్ రిఫరీకి కూడా ఈ విషయం చెప్పినా అతను ఏం చేయలేకపోయాడు.

అంపైర్ తప్పిదంతో..

ఈ ఊహించని పరిణామంతో ఆటపై ఏకాగ్రత కోల్పోయిన సింధు వరుసగా పాయింట్లు కోల్పోయి 19-21తో రెండో గేమ్ కోల్పోయింది. మూడో గేమ్‌లో కూడా 16-21తో వెనుకపడి పరాజయం పాలైంది. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన సింధు అంపైర్ల తీరును తప్పుబట్టింది. 'సర్వీస్‌ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నావని రిఫరీ నాతో అన్నాడు. అయితే నేను సర్వీస్‌ చేసే సమయానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. కానీ రిఫరీ నా మాటలు పట్టించుకోకుండా యమగూచికి పాయింట్‌ ఇచ్చాడు. ఇది అన్యాయం. సెమీఫైనల్లో ఓటమికి ఇదో కారణం.

అన్యాయం జరిగింది..

అన్యాయం జరిగింది..

రెండో గేమ్‌లో 14-11తో ఆధిక్యంలో ఉన్నా. అలాగే జోరులో 15-11తో విజయానికి చేరవ అయ్యేదాన్ని. అనవసరంగా ఒక పాయింట్‌ కోల్పోవడంతో స్కోరు 14-12గా మారింది. రిఫరీ ఇచ్చిన ఆ పాయింట్‌ న్యాయమైంది కాదు. ఈ మ్యాచ్‌లో నేను గెలిచి ఫైనల్‌కు వెళ్లాల్సింది. ఈ విషయంపై చీఫ్‌ రిఫరీకి కూడా ఫిర్యాదు చేశా. కానీ అప్పటికే రిఫరీ పాయింట్‌ ఇచ్చేశాడు కదా అన్నాడు. ఒక చీఫ్‌ రిఫరీగా అతడు కనీసం ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించాల్సింది" అని సింధు పేర్కొంది. ఇక ఈ సెమీఫైనల్​లో ఓడిపోయిన సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది.

రెండో పతకం..

రెండో పతకం..

కాగా, ఈ ఆసియా ఛాంపియన్‌షిప్‌ టోర్నీల్లో సింధుకు ఇది రెండో పతకం కావడం విశేషం. 2014లో జిమ్‌చన్‌ (దక్షిణ కొరియా) షట్లర్‌పై తొలిసారి కాంస్య పతకం కైవసం చేసుకుంది. సైనా నెహ్వాల్‌ (2010 దిల్లీ, 2016 వుహాన్‌, 2018 వుహాన్‌) సైతం గతంలో ఈ పోటీల్లో మూడుసార్లు కాంస్యంతోనే సరిపెట్టుకుంది

Story first published: Sunday, May 1, 2022, 16:57 [IST]
Other articles published on May 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X