న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబ్బు సంపాదించడానికి రాలేదు... చాంపియన్స్‌ను తయారు చేస్తా: సింధు కొరియన్ కోచ్

Not here to make money, but produce champions: PV Sindhus new Korean coach

హైదరాబాద్: డబ్బు సంపాదించడానికి రాలేదని చాంపియన్స్‌ను తయారు చేసేందుకే ఇక్కడికి వచ్చానని పీవీ సింధు కొత్త కొరియన్ కోచ్ కిమ్ జి హ్యూన్ వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరతో జరిగిన ఫైనల్‌లో 21-7, 21-7 తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

ఫలితంగా వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పీవీ సింధు మంగళవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌‌‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా పుల్లెల గోపీచంద్‌ అకాడమీకి సింధు బయల్దేరి వెళ్లారు.

పారా వరల్డ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం: ఎవరీ మానసి జోషిపారా వరల్డ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం: ఎవరీ మానసి జోషి

గోపీచంద్ అకాడమీలో

గోపీచంద్ అకాడమీలో

అనంతరం గోపీచంద్ అకాడమీలో పీవీ సింధు మాట్లాడుతూ "ఈసారి నిజంగానే ఫోకస్ పెట్టా... ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త కోచ్‌ మిస్ కిమ్‌ను కలిగి ఉన్నా. గత కొన్ని నెలలుగా ఆమె పర్యవేక్షణలో కఠినమైన శిక్షణ తీసుకున్నా. ఎంతో మెరగయ్యా. ఆమెకు నిజంగా చాలా కృతజ్ఞతలు" అని అన్నారు.

ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్‌: మొన్న ఐపీఎల్... నిన్న ప్రో కబడ్డీ... నేడు పుట్‌బాల్

కిమ్ జి హ్యూన్ మాట్లాడుతూ

కిమ్ జి హ్యూన్ మాట్లాడుతూ

కాగా, స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కిమ్ జి హ్యూన్ మాట్లాడుతూ "నేను ఇక్కడికి డబ్బు సంపాదించడానికి రాలేదు, ఛాంపియన్లను తయారు చేస్తా. నేను ఇక్కడ నా జాబ్‌ను ఎంజాయ్ చేయలేకపోతే(స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా-గోపీ చంద్ బ్యాడ్మింటన్ అకాడమీ) రాజీనామా చేయడానికి కూడా వెనుకాడను" అని అన్నారు.

ఆకాశంలో విహరిస్తున్నా

ఆకాశంలో విహరిస్తున్నా

"నాతో పాటు నా ట్రైనీలలో ప్రతి ఒక్కరూ వారి పాత్రను ఆనందిస్తారని నేను భావిస్తున్నాను. నా పర్యవేక్షణలో సింధు వరల్డ్ ఛాంపియన్‌షి‌ఫ్‌లో స్వర్ణం నెగ్గడంతో ఆకాశంలో విహరిస్తున్నా. శారీరక, మానసిక, నైపుణ్యాలను ఎప్పటిలాగే మెరుగుపరచడానికి సింధు పట్ల నా ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంటుంది. ఒలింపిక్స్ నేపథ్యంలో రిలాక్స్ అవడం కుదరదు" అని ఆమె తెలిపారు.

1994 హిరోషియా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం

1994 హిరోషియా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం

కిమ్ జి హ్యూన్ విషయానికి వస్తే ఆమె మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్. 1994 హిరోషియా ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. మాజీ వరల్డ్ నంబర్ 2 సుంగ్ జీ-హ్యూన్‌కు కూడా కోచింగ్ ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమె పీవీ సింధుకు కోచ్‌గా నియమింపబడ్డారు.

Story first published: Wednesday, August 28, 2019, 13:56 [IST]
Other articles published on Aug 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X