గచ్చిబౌలిలో మ్యాచ్‌లు: హైదరాబాద్ పుట్‌బాల్ అభిమానులకు శుభవార్త

హైదరాబాద్: గత ఐదేళ్లుగా అలరిస్తూ వస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ ఆరో సీజన్‌లో హైదరాబాద్‌లోనూ అడుగు పెట్టబోతోంది. ఇందులో భాగంగా అక్టోబరు 20న ఆరంభమయ్యే ఇండియన్ సూపర్ లీగ్ ఆరో సీజన్‌లో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అరంగేట్రం చేయబోతోంది.
ఇది నిజంగా హైదరాబాద్ ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్తే. గత కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఎఫ్‌సీ పుణె సిటీ స్థానంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీని వచ్చే సీజన్‌లో తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఐఎస్ఎల్ ఐదో సీజన్‌కు సంబంధించి ఆటగాళ్లు, సిబ్బంది జీతాలు సైతం పుణె ప్రాంఛైజీ ఇప్పటివరకు ఇవ్వలేదు.
దీంతో ఆ ఫ్రాంఛైజీని రద్దు చేయాలని ఐఎస్‌ఎల్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కాగా, హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ పేరుతో ఆరో సీజన్‌లోకి అడుగుపెట్టనున్న కొత్త ఫ్రాంఛైజీని విజయ్ మద్దూరి, వరుణ్ త్రిపురనేని కొనుగోలు చేశారు. గచ్చిబౌలిలోని ఫుట్‌బాల్ స్టేడియం వేదికగా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మ్యాచ్‌లకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఐఎస్ఎల్ తన ప్రకటనలో "అద్భుతమైన పుట్ బాల్ కల్చర్ కలిగిన హైదరాబాద్ సిటీ తన సొంత జట్టుతో హీరో ఇండియన్ సూపర్ లీగ్ సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది" అని పేర్కొంది.

ఆర్ధిక సమస్యలతోనే పుణె సిటీ ఫ్రాంఛైజీని రద్దు
మరోవైపు ఆర్ధిక సమస్యలతోనే పుణె సిటీ ఫ్రాంఛైజీని రద్దు చేస్తున్నట్లు వధవాన్ గ్రూప్ ఓనర్లు అధికారిక ప్రకటన చేశారు. ఇక, విజయ్ మద్దూరి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. గత పదేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన డిజిటల్ ఇంటిగ్రేషన్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఇన్సెసాంట్ టెక్నాలజీస్ కంపెనీ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన విజయ్ మద్దూరి
అంతకముందు వర్చుశా ఇండియా ప్రై లిమిటెడ్ కంపెనీలో సేల్స్ అండ్ క్లయింట్ సర్వీసెస్ విభాగానికి డైరెక్టర్‌గా కొనసాగారు. 2015లో ప్రఖ్యాత యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో వన్ ఇయర్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పుట్‌బాల్ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తామని తెలిపారు.

పుట్‌బాల్ ఆటపై ఉన్న మమకారంతో
ఇక, వరుణ్ త్రిపురనేని విషయానికి వస్తే యువ పారిశ్రామిక వేత్తగా సుపరిచితం. పుట్‌బాల్ ఆటపై ఉన్న మమకారంతో ఆయన ఎఫ్‌సి హైదరాబాద్ ఫ్రాంఛైజీలో భాగస్వామి అయ్యారు. ఇండియన్ సూపర్ లీగ్ ఆరంభ సీజన్‌లో కేరళ బ్లాస్టర్ జట్టుకు టీమ్ మేనేజర్‌గా సేవలందించారు.

హైదరాబాద్ సిటీ గర్వించేలా చేస్తా
ఆ తర్వాత చెన్నయిన్ ఎఫ్‌సి ఫ్రాంచైజీకి సీఈఓగా... ఆ తర్వాత కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సి జట్టుకు సీఈఓగా సేవలందించారు. కొన్నాళ్ల పాటు చెన్నై పుట్‌బాల్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. ఈ సందర్భంగా వరుణ్ త్రిపురనేని మాట్లాడుతూ ఈ క్లబ్‌తో హైదరాబాద్ సిటీ గర్వించేలా చేస్తానని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications