సింధు గెలిచింది.. భారత్ ఓడింది.. అయినా క్వార్టర్ ఫైనల్ లోకి...

Posted By: Subhan
 Sindhu wins, India lose to Japan but reach quarter-finals

హైదరాబాద్: భారత షట్లర్లు ఒకరు వెనకబడితే మరొకరు ముందుకు పరిగెడుతున్నారు. దీంతో గురువారం జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత మకతికల మాయాజాలాన్ని ప్రదర్శించింది. ఈ పోటీలలో మహిళల జట్టు క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 1-4తో జపాన్ చేతిలో ఓడిపోయింది. గ్రూప్-డబ్ల్యూలో ఒక విజయం, ఒక పరాజయంతో రెండోస్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. తొలి సింగిల్స్ ఆడిన పీవీ సింధు 21-19, 21-15తో యమగుచిపై గెలిచింది. 36 నిమిషాల పోరులో సింధు ప్రతీకారాన్ని తీర్చుకుంది. తాజా విజయంతో సింధు ముఖాముఖి రికార్డును 5-3కు పెరిగింది.

రెండో సింగిల్స్‌లో శ్రీకృష్ణ ప్రియా 12-21, 10-21తో సయాకా సాటో చేతిలో, మూడో సింగిల్స్‌లో అశ్విని పొన్నప్ప 14-21, 12-21తో ఆయా ఒహోరి చేతిలో ఓడారు. దీంతో జపాన్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. డబుల్స్‌లో సనోగిత-ప్రజక్తా సావంత్ 17-21, 17-21తో సాహిహో టనకా-కొహరు యోనెమోటో చేతిలో, అశ్విని-సిక్కీ రెడ్డి 18-21, 18-21తో మిసాకి ముస్టామో-ఆయకా తకహసి చేతిలో పరాజయం చవిచూడటంతో జపాన్ 4-1తో నెగ్గింది.

ఇండోనేసియాతో ఆఖరి గ్రూప్‌ సమరంలో..జొనాథన్‌ క్రిస్టీతో తొలి సింగిల్స్‌లో 17-21, 17-21 స్కోరుతో కిదాంబి శ్రీకాంత్‌ వరుస గేముల్లో ఓటమి పాలవడంతో భారత్‌ 0-1తో వెనుకంజలో నిలిచింది. కానీ మొదటి డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి, రెండో సింగిల్స్‌లో ప్రణీత్‌ గెలవడంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే రెండో డబుల్స్‌లో నెగ్గి ఇండోనేసియా 2-2తో సమం చేసింది. ఇక నిర్ణాయక మూడో సింగిల్స్‌లో సుమిత్‌ రెడ్డి 21-21, 7-21 స్కోరుతో చేతులెత్తేయడంతో భారత్‌ 2-3తో ఓడిపోయింది..

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, February 9, 2018, 8:36 [IST]
Other articles published on Feb 9, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి