న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనా ఓటమితో ఉబెర్ కప్ నుంచి భారత్ నిష్క్రమణ

By Nageshwara Rao
India women’s badminton team thrashed 0-5 by Japan, bow out of Uber Cup

హైదరాబాద్: ఉబెర్ కప్ నుంచి భారత మహిళల బ్యాడ్మింటన్‌ జట్టు నిష్క్రమించింది. మంగళవారం థామస్‌ కప్‌ నుంచి పురుషుల జట్టు నిష్క్రమిస్తే.. బుధవారం సైనా నెహ్వాల్‌ సారథ్యంలోని భారత బ్యాడ్మింటన్ జట్టు ఉబెర్‌ కప్‌ ఫైనల్‌ నుంచి నిష్క్రమించింది.

Gopichand Training Saina And Sindhu at Separate Venues

తప్పక నెగ్గాల్సిన గ్రూప్‌-ఎ చివరి మ్యాచ్‌లో 0-5 తేడాతో జపాన్‌ చేతిలో చిత్తుగా ఓడింది. గత ఏడాది ఇదే టోర్నీలో కాంస్యం సాధించిన భారత్‌.. ఈ ఏడాది మాత్రం ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, అశ్విని పొన్నప్ప లేకుండా బరిలోకి దిగింది. బుధవారం జరిగిన తొలి సింగిల్స్‌లో సైనా శుభారంభాన్ని ఇస్తుందని ఆశించారు.

అందుకు తగ్గట్టే ఆరంభంలో అద్భుత ప్రదర్శన చేసిన సైనా నెహ్వాల్‌.. ఆ తర్వాత అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. 19-21, 21-9, 20-22 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్‌ యమగూచి చేతిలో సైనా నెహ్వాల్ పోరాడి ఓడింది. ఇక, డబుల్స్‌ తొలి మ్యాచ్‌లో సన్యోగిత-ప్రజక్త జోడీ 15-21, 6-21తో అయాక-మిసాకి జంట చేతిలో ఓడింది.

మరో సింగిల్స్‌లో మ్యాచ్‌లో వైష్ణవి రెడ్డి 10-21, 13-21 తేడాతో ఒకుహర చేతిలో ఓటమి పాలైంది. నాలుగో మ్యాచ్‌లో వైష్ణవి భాలే- మేఘనా జక్కంపూడి జోడీ 8-21, 17-21తో.. చివరి మ్యాచ్‌లో అరుణ 12-21, 7-21తో ప్రత్యర్థుల చేతుల్లో ఓడాయి. దీంతో ఈ ఏడాది ఉబెర్ కప్ నుంచి భారత్ ఏ పతకం లేకుండా వెనుదిరిగింది.

Story first published: Thursday, May 24, 2018, 11:42 [IST]
Other articles published on May 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X