
హైదరాబాద్: 2016 రియో ఒలింపిక్స్ వెండి పతక గ్రహీత పీవీ సింధు 2017 సంవత్సరాన్ని దేదీప్యమానంగా ముగించేందుకు యోచిస్తోంది. ఈ ప్రయత్నంలోనే పది లక్షల డాలర్ల (64 కోట్ల 36 లక్షలు )దుబాయ్ సూపర్ సిరీస్‌ను గెలచుకునేందుకు సిద్ధమైంది.
వరుస సిరీస్‌లు ఆడుతూ బిజీబిజీగా ఉన్న పీవీ సింధు ఈ ఏడాది ముగింపులో భారీ విజయాన్ని అందుకునే దిశగా అడుగులేస్తుంది. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో వెండి పతక అందుకుంది. సూపర్ సిరీస్ రన్నర్ గా నిలిచింది. అక్టోబరు, నవంబరు నెలల్లో ఆడిన ఈ సిరీస్‌లతో
విజయోత్సాహంలో ఉన్న సింధు మరో సిరీస్‌కు సిద్ధమైంది.
ప్రత్యర్థులు మాత్రం ఒలింపిక్ వెండి పతక విన్నర్ అనే విషయం దృష్టిలో ఉంచుకొని గట్టి బందోబస్తుతో సిద్ధమౌతున్నారు. " ఈ ఏడాది నాకు బాగా జరిగింది. ఇదే స్థాయిలో ఈ సంవత్సారాన్ని ముగించనున్నాను. మొదటి రౌండ్ కష్టంగా ఉంటుందని అంచనా వేస్తున్నాను. నేనూ అదే స్థాయిలో సిద్ధంగా ఉన్నాను. నా ఆటకు 100శాతం కష్టం పెట్టి ఆడతాను. దుబాయ్ సిరీస్ ఫైనల్స్ కి వెళ్లేందుకు ప్రాక్టీస్ అయ్యాను. " అంటూ మీడియా సమావేశంలో ముచ్చటించింది.
"వచ్చే ఏడాది ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయని అడిగిన ప్రశ్నకి " నా ఆట తీరును బట్టి నా కోచ్ ఆ విషయాన్ని నిర్ణయిస్తారు. అన్నీ బాగుంటే ఈ ఏడాదిలానే వచ్చే సంవత్సరం కూడా ఉండాలని కోరుకుంటున్నాను." అని వెలిబుచ్చింది.
దుబాయ్ సిరీస్‌లో కిదాంబి శ్రీకాంత్ కూడా ఆడుతున్నాడు. కాగా, డిసెంబరు 11న కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ స్థాయి మొట్ట మొదటి స్థానంలో ఉన్న విక్టర్ ఏక్సెలెన్‌తో తలపడ్డాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. శ్రీకాంత్ మొన్నామధ్య ఆరోగ్యం బాగాలేక విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యం బాగుపడిన తర్వాత తను ఆడిన మొదటి మ్యాచ్ ఇదే.
పతకంతోనే తిరిగొస్తామనే పట్టుదల సింధు, శ్రీకాంత్‌ల మధ్యలో కన్పిస్తుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.