న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా యోధులకు పతాకాలిచ్చేసిన బ్యాడ్మింటన్ చాంప్

Carolina Marin offered her medals to medical professionals in Spain for service during pandemic

మాడ్రిడ్: స్పెయిన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌, రియో ఒలింపిక్స్ విజేత కరోలినా మారిన్.. కరోనాపై పోరాడుతున్న వైద్యులకు కృతజ్ఞతగా తన మెడల్స్‌ అన్నిటినీ ఇచ్చేసింది. ప్రపంచాన్ని కకాలావికలం చేసిన కోవిడ్-19‌ను ప్రాణాలు తెగించి మరి వైద్యులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

యావత్ ప్రపంచం స్వీయ నిర్భంధంలోకి వెళ్లినా డాక్టర్లు మాత్రం బాధితులను రక్షించేందుకు అహర్నిషులు శ్రమించారు. ఇక స్పెయిన్‌లో కూడా ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన కరోలినా మారిన్.. తన మెడల్స్ అన్నిటినీ ఇచ్చేసింది. ఈ విషయాన్ని ఆమెనే మీడియాకు తెలియజేసింది.

'నా మెడల్స్ అన్నిటిని స్పెయిన్ కరోనా పోరాట యోధులు, రియల్ హీరోస్‌కు ఇచ్చేసా. కృతజ్ఞతలు అందుకోవడానికి అర్హులు. క్లిష్ట పరిస్థితులు డాక్టర్ల సేవ స్పూర్తిదాయకం. వాళ్లందరికి నేను ధన్యావాదాలు తెలుపుతున్నా. మహమ్మారి బారిన పడిన బాధితులను అహర్నిషులు కష్టపడుతూ రక్షిస్తున్న తీరు ప్రశంసనీయం. వారు వారి బాధ్యతలను అద్భుతంగా నిర్వరిస్తున్నారు.

ఈ విపత్కర కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ ఫైటర్స్‌కు నా కృతజ్ఞతలు'అని మారిన్ పేర్కొంది. వీడియో కాల్ ద్వారా పలువురి వైద్యులతో మాట్లాడిన మారిన్ వారిని ప్రశంసిస్తూ.. భరోసానిచ్చే ప్రయత్నం చేసింది. ఇక స్పెయిన్‌లో ఇప్పటి వరకు 2 లక్షల 51వేల కేసులు నమోదవ్వగా.. లక్షా 50 వేల మంది కోలుకోగా.. 28,385 మంది ప్రాణాలు కోల్పోయారు.

Story first published: Monday, July 6, 2020, 13:57 [IST]
Other articles published on Jul 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X