న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2022 : పునరాగమనంలో సెరెనా విలియమ్స్‌కు ఘోర పరాభవం, తొలి రౌండ్లోనే నిష్క్రమణ

 Wimbledon 2022: Serena Williams Lost to World no.115 Harmony Tan in First Round of Tourny

టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన వింబుల్డన్ పునరాగమనంలో మొదటి రౌండ్లోనే ఇంటి బాట పట్టింది. ప్రపంచ నంబర్ 115 ర్యాంకు ప్లేయర్ అయిన ఫ్రాన్స్‌కు చెందిన హార్మొనీ టాన్‌తో ఆమె మొదటి రౌండ్లోనే ఓడిపోవడంతో ఆమె అభిమానులు నిరాశచెందారు. ఓడిపోయినప్పటికీ ముఖంపై చిరునవ్వుతో ఆమె కోర్టు నుంచి బయటికి వెళ్లింది. 23సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్, 7సార్లు వింబుల్డన్ విజేత అయిన ఆమె తన కమ్ బ్యాక్‌లో సక్సెస్ కాలేకపోయింది. మంగళవారం 3గంటల 10 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో అత్యుత్తమంగా సెరెనా ఆడినప్పటికీ టై బ్రేకర్లో చివరి పాయింట్లో అనూహ్యంగా ఓడిపోయింది.
గతేడాది వింబుల్డన్‌లో తన మొదటి రౌండ్ మ్యాచ్‌లో గాయం కారణంగా సెరెనా విలియమ్స్‌ రిటైర్డ్ హార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి ఆమెపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక తొలి రౌండ్లో కూడా హార్మొనీ టాన్‌ లాంటి సాదాసీదా ప్లేయర్‌నే ఎదుర్కోవడంతో ఆమె విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో 5-7, 6-1, 6-7 (7)తో సెరెనా ఓటమి పాలయింది. 40ఏళ్ల సెరెనా.. ఓపెనింగ్ సెట్‌ను కోల్పోయిన తర్వాత తిరిగి బ్రహ్మాండగా పుంజుకుంది. రెండో సెట్‌లో హార్మొనీని తనదైన స్టైల్లో దెబ్బతీసింది. ఇక టై బ్రేకర్‌ అయిన మూడో సెట్‌లో కూడా తొలుత 4-0తో ఆధిక్యంలో ఉండి చివరికి వెనకబడి సెట్ కోల్పోయింది. ఏదేమైనప్పటికీ వింబుల్డన్ టోర్నీలో అరంగేట్రం చేస్తున్న హార్మొనీ టాన్‌కి ఇదో మరుపు రాని విజయం.

సెరెనాను ఓడించాక హర్మోనీ టాన్ మాట్లాడుతూ.. 'తొలి రెండు సెట్లో డ్రా అయ్యాక నేను చాలా భయపడ్డాను. నేను ఒకటి లేదా రెండు గేమ్‌లు వరుసగా గెలవాలని ఆశించాను. ఇక చివరి వరకు మ్యాచ్ చాలా టఫ్‌గా సాగింది. చివరి పాయింట్లో సెరెనా కొట్టిన షాట్ నెట్‌కు తగిలి పాయింట్ రావడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి' అని హార్మొనీ టాన్ తెలిపింది.

Story first published: Wednesday, June 29, 2022, 8:32 [IST]
Other articles published on Jun 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X