వైరల్ ఫొటోలు: పారిస్‌ వీధుల్లో సానియా చక్కర్లు.. సోదరి బ్యాచిలర్‌ పార్టీలో హల్‌చల్‌!!

పారిస్: భారత స్టార్ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రస్తుతం పారిస్‌ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. అక్కడి నగర అందాలను తనివితీరా ఆస్వాదిస్తోంది. సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఆనమ్ మీర్జా తన బ్యాచిలర్‌ పార్టీని పారిస్‌లో ఏర్పాటు చేయడంతో ఇద్దరు సోదరీమణులు అక్కడ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న 'బజరంగ్‌'

 ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు:

ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు:

ఇటీవలే ఆనమ్ మిర్జా తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆనమ్‌ మీర్జా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్‌ను ఆనమ్‌ వివాహం చేసుకోబోతోందని అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని కూడా తిరిగారు. దీంతో ఆనమ్‌కు కాబోయే భర్త అసదుద్దీనే అని స్పష్టమయింది.

పారిస్‌లో బ్యాచిలర్‌ పార్టీ:

ఆనమ్‌ మీర్జా తన బ్యాచిలర్‌ పార్టీని పారిస్‌లో ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే ఈ బ్యాచిలర్‌ పార్టీలో సానియా మీర్జా హైలెట్‌గా నిలిచారు. పార్టీ అనంతరం ఇద్దరు సోదరీమణులు పారిస్‌ వీధుల్లో చక్కర్లు కొట్టారు. వీధి వీధి తిరుగుతూ అక్కడి నగర అందాలను ఆస్వాదించారు.

సానియా అందం ఏమాత్రం తగ్గలేదు:

సానియా అందం ఏమాత్రం తగ్గలేదు:

పారిస్ వీధుల్లో దిగిన ఫోటోలను సానియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం సానియా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు సరదా కామెంట్స్‌ చేస్తున్నారు. 'ఓ బిడ్డకు తల్లి అయినా.. సానియా అందం మోడల్‌కు ఏ మాత్రం తీసిపోలేదు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'సానియా ఆటకు, యాటిట్యూడ్‌కు సలాం' అని మరో నెటిజన్ కామెంట్‌ చేసాడు.

 2016లో అక్బర్‌ రషీద్‌తో పెళ్లి:

2016లో అక్బర్‌ రషీద్‌తో పెళ్లి:

25 ఏళ్ల ఆనమ్‌ మిర్జా 2016లో అక్బర్‌ రషీద్‌ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పరిణితి చోప్రా తదితరులు పాల్గొని సందడి చేశారు. అయితే.. ఏమైందో తెలియదు గానీ రషీద్‌ నుంచి ఆనమ్‌ విడాకులు తీసుకునేందుకు దరఖాస్తు చేసినట్లు గతేడాది వార్తలు వచ్చాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, September 20, 2019, 9:17 [IST]
Other articles published on Sep 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X