న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US Open 2021: ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్.. యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌!!

US Open 2021 Final: Daniil Medvedev beats Novak Djokovic to Wins Maiden Grand Slam Title

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ 2021లో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో ప్రపంచ నంబర్‌వన్‌, సెర్బియా స్టార్ నోవాక్‌ జకోవిచ్‌ను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయాడు. దాంతో మెద్వెదెవ్‌ తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకున్నాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం జరిగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4 తేడాతో జకోవిచ్‌ను ఓడించాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్‌ ఇంకొన్ని రోజులపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.

న్యూయార్క్‌ సిటీలోని ఆర్థర్‌ ఆషే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగ్గా.. అభిమానులతో మైదానం అంతా నిండిపోయింది. దాంతో మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా ప్రారంభమైంది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి డానిల్‌ మెద్వెదెవ్‌, నోవాక్‌ జకోవిచ్‌ నువ్వానేనా అన్నట్లు ఆడారు. మెద్వెదెవ్‌ తన అద్భుత ఆటతో జకోవిచ్‌పై పైచేయి సాధించి తొలి సెట్‌ను 6-4 తేడాతో గెలిచాడు. అయితే రెండో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్‌ బ్రేక్‌లతో విరుచుకుపడడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థితికి చేరింది. అయితే జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వని మెద్వెదెవ్‌ 6-4 తేడాతో రెండో సెట్‌ను కూడా కైవసం చేసుకున్నాడు.

ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో 34 ఏళ్ల జకోవిచ్‌ మొదట తేలిపోయినప్పటికీ.. తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికీ 25 ఏళ్ల మెద్వెదెవ్‌ విజయాన్ని 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత జకో అడ్డుకోలేపోయాడు. దీంతో హోరాహోరీగా సాగిన ఈ సెట్‌లో మెద్వెదెవ్‌ 6-4 తేడాతో గెలిచాడు. దీంతో మెద్వెదెవ్‌ మూడో సెట్‌ను గెలిచి టెన్నిస్‌ చరిత్రలో తన కొత్త చరిత్ర సృష్టించాడు. 2019లో యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి ఓటమి పాలైన మెద్వెదెవ్‌ ఇప్పుడు టైటిల్‌ అందుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో కేవలం ఒక్కసెట్‌లో మాత్రమే ఒడిపోయి టైటిల్‌ గెలిచిన ఆటగాడిగా మెద్వెదెవ్‌ నిలిచాడు.

డానిల్‌ మెద్వెదెవ్‌ యూఎస్‌ ఓపెన్‌ 2021 టైటిల్ గెలవడంతో.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు నోవాక్‌ జకోవిచ్‌ ఇంకొన్ని రోజుల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే జకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, రఫెల్ నాదల్‌ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెన్నిస్‌ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని లిఖిద్దామనకుంటే జకోకు నిరాశే ఎదురైంది. ఇక యూఎస్‌ ఓపెన్‌ 2021 సింగిల్స్‌ విభాగంలో ఈసారి ఇద్దరు కొత్త ఛాంపియన్లు అవతరించారు. మహిళ సింగిల్స్‌లో 18 ఏళ్ల ఎమ్మా రెడుకాను (బ్రిటన్‌) విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

మహిళల సింగిల్స్‌లో క్వాలిఫయర్‌గా అడుగుపెట్టిన ఎమ్మా రెడుకాను వరుస విజయాలతో యూఎస్‌ ఓపెన్‌ 2021 టైటిల్‌ సాధించింది. క్వాలిఫయర్‌గా ప్రారంభించి గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన రెడుకాను.. 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన బ్రిటన్‌ క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కింది. 150వ ర్యాంక్‌తో న్యూయార్క్‌ చేరిన రెడుకాను.. తాజాగా విడుదల కానున్న డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 23వ స్థానానికి ఎగబాకనుంది. టోర్నీ ఆసాంతం ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా ఫైనల్‌ చేరిన రెడుకాను.. శనివారం ముగిసిన తుది పోరులో 6-4, 6-3తో 73వ ర్యాంకర్‌ లైలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై విజయం సాధించింది. క్వాలిఫయింగ్‌ టోర్నీలో మూడు మ్యాచ్‌లు నెగ్గిన ఆమె మొయిన్‌ డ్రాలో వరుసగా ఏడు మ్యాచ్‌లు నెగ్గి చాంపియన్‌గా నిలిచింది.

Story first published: Monday, September 13, 2021, 7:09 [IST]
Other articles published on Sep 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X