న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉత్కంఠభరితంగా యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్.. టైటిల్ నాదల్‌దే!!

US Open 2019: Rafael Nadal beat Daniil Medvedev in five-set encounter to clinch 19th Grand Slam title

న్యూయార్క్‌: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సత్తా చాటాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో నాదల్ విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 7-5, 6-3, 5-7, 4-6, 6-4 తేడాతో ఐదో సీడ్ మెద్వదెవ్ (రష్యా)పై అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ విజయంతో నాదల్ 19వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నాదల్‌కు ఇది నాలుగవ యుఎస్ ఓపెన్ టైటిల్. 30 ఏళ్లు నిండిన తర్వాత ఐదు ప్రధాన టైటిళ్లు సాధించిన మొదటి వ్యక్తి కూడా నాదలే.

'భారీ లక్ష్యం ముందుంది.. ఆసీస్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు''భారీ లక్ష్యం ముందుంది.. ఆసీస్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

నాలుగు గంటల 50 నిమిషాల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి రెండు సెట్‌లను గెలిచిన నాదల్.. అనవసర తప్పిదాలు చేసి మూడు, నాలుగు సెట్‌లను ప్రత్యర్థికి అప్పగించాడు. ఇక నిర్ణయాత్మక ఐదవ సెట్‌లో తన అనుభవాన్ని ఉపయోగించి సెట్‌తో పాటు మ్యాచ్ గెలుచుకున్నాడు. తొలి ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న మెద్వదెవ్ అద్భుతంగా పోరాడాడు. నాదల్‌కు గట్టి పోటీ ఇచ్చి ప్రశంసలు అందుకున్నాడు. ఈ విజయంతో నాదల్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత రోజర్‌ ఫెదరర్‌ (20)కు ఒక్క టైటిల్‌ దూరంలో మాత్రమే నిలిచాడు.

శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాదల్ 7-6(8/6), 6-4, 6-1 తేడాతో 24వ సీడ్ మెటియో బ్రెటినీ (ఇటలీ)పై విజయం సాధించాడు. 2గంటల 35 నిమిషాల పాటు సాగిన ఆ మ్యాచ్‌లో నాదల్ దూకుడుకు తాళలేక అనవసర తప్పిదాలు చేసి బ్రెటినీ ఇంటిదారి పట్టాడు. మరో సెమీస్‌లో మెద్వదెవ్ 7-6(7/5), 6-4, 6-3 తేడాతో అన్‌సీడెడ్ గ్రిగొరి దిమిత్రోవ్ (బల్గేరియా)పై విజయం సాధించిన విషయం తెలిసిందే.

యూఎస్ ఓపెన్‌లో రఫెల్‌కు నాలుగోది కావడం విశేషం. యూఎస్ ఓపెన్‌లో రఫెల్ ఫైనల్ ఆడటం ఇది ఐదోసారి కాగా.. గతంలో మూడు సార్లు 2017, 2013, 2010లో విజేతగా నిలిచాడు. 2011లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విజేత రఫెల్‌కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్‌ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

30 ఏట అడుగుపెట్టిన తర్వాత ఐదు మేజర్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా నాదల్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఫెడరర్‌, జకోవిచ్‌, లావెర్‌, రోజ్‌వాల్‌ పేరిట ఉన్న రికార్డును నాదల్‌ బద్దలు కొట్టాడు. వీరంతా 30 ఏళ్లు దాటిన తర్వాత నాలుగేసి టైటిళ్లు సాధించారు. 33 ఏళ్ల నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి.

Story first published: Monday, September 9, 2019, 11:20 [IST]
Other articles published on Sep 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X