న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేనెనప్పటికీ ఈ మ్యాచ్‌ను గుర్తుంచుకుంటా: గద్గత స్వరంతో థీమ్

By Nageshwara Rao
US Open 2018: Dominic Thiem says narrow defeat to close friend Rafael Nadal will be stuck in his head forever

హైదరాబాద్: "ఒకే ఒక పాయింట్‌ ఎక్కువ చేసి నాదల్ గెలిచాడు. ఏమో! ఓటమి ఎప్పుడూ నావెంటే ఉంటుందేమో" న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌ క్వార్టర్స్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం డొమినిక్‌ థీమ్‌ అన్న మాటలివి.

బుధవారం హోరాహోరీగా డొమినిక్‌ థీమ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మ్యాచ్‌లో 0-6, 6-4, 7-5, 6-7 (4/7), 7-6 (7/5) తేడాతో రఫెల్ నాదల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం డొమినిక్‌ థీమ్‌ మాట్లాడుతూ "ఈ మ్యాచ్‌ ఎప్పటికీ నా మదిలో ఉండిపోతుంది. కచ్చితంగా నేనెనప్పటికీ ఈ మ్యాచ్‌ను గుర్తుంచుకుంటా" అని అన్నాడు.

ఎండవేడికి తట్టుకోలేక ఒకే మ్యాచ్‌లో 11 షర్ట్స్ మార్చిన ఆటగాడుఎండవేడికి తట్టుకోలేక ఒకే మ్యాచ్‌లో 11 షర్ట్స్ మార్చిన ఆటగాడు

"టెన్నిస్‌ కొన్నిసార్లు అత్యంత క్రూరంగా ఉంటుంది. మ్యాచ్‌లో భాగంగా ఎవరో ఒకరు ఓడిపోక తప్పదు. ఐదో సెట్‌ టైబేక్రర్‌తో ఇది ముగిసింది. ఇద్దరికీ చెరిసగం అవకాశాలు ఉన్నాయి. కానీ, నాదల్‌ ఒక పాయింట్‌ నాకంటే ఎక్కువ చేసి గెలిచాడు. ఏమో! ఓటమి ఎప్పుడూ నావెంటే ఉంటుందేమో" అని థీమ్ ఆవేదనతో అన్నాడు.

చాలా ఇబ్బంది పడ్డా

మరోవైపు మ్యాచ్‌లో తాను చాలా ఇబ్బంది పడ్డానని వరల్డ్ నంబర్‌ వన్‌, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ అన్నాడు. యూఎస్‌ ఓపెన్‌లో నాదల్‌ ఆడిన సుదీర్ఘ మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. మ్యాచ్ అనంతరం నాదల్ మాట్లాడుతూ "డొమినిక్‌ థీమ్‌ను క్షమించమని అడిగా. అతనో గొప్ప ఆటగాడు. గొప్ప టైటిళ్లు గెలిచే అవకాశాలు అతడి ముంగిట ఉన్నాయి" అని నాదల్ అన్నాడు.

క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన

ప్రస్తుత టోర్నీలో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన డొమినిక్ థీమ్‌ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరచాడు. తొలి సెట్‌లో నాదల్‌కు అసలేమాత్రం అవకాశమివ్వకుండా చెలరేగి ఆడాడు. ధీమ్ జోరుని చూసిన టెన్నిస్ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలి సెట్‌ను 6-0తో నెగ్గిన థీమ్ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్‌కు సైతం షాకిచ్చాడు.

తొలి సెట్‌ ఓడిన స్పెయిన్‌ బుల్ రఫెల్ నాదల్

ఒక్క పాయింట్‌ చేయకుండానే తొలి సెట్‌ ఓడిన స్పెయిన్‌ బుల్‌ తర్వాత సెట్లలో విజృంభించాడు. తన స్థాయికి తగ్గట్టుగా రాణించి వరుసగా రెండు సెట్లు సొంతం చేసుకున్నాడు. ఇక, నాలుగో సెట్‌లోనూ నాదల్ తన జోరుని కొనసాగించాడు. ఈ సెట్‌లో డొమినిక్ గట్టి పోటీనివ్వడంతో మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేకర్‌లో నాదల్‌పై ఆధిపత్యం ప్రదర్శించి 7-4 పాయింట్లతో టై బ్రేక్‌లో నాలుగో సెట్ నెగ్గాడు.

5వ సెట్‌లోనూ ఇద్దరి మధ్య హోరాహోరీగా పోరు

దీంతో నిర్ణయాత్మక 5వ సెట్‌లోనూ ఇద్దరి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడటంతో మరో సారి టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో నాదల్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి ఈ మ్యాచ్‌లో విజయం సాధించాడు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు నాదల్‌నే విజయం వరించింది.

సెమీస్‌లో నాదల్‌ మూడో సీడ్‌ జాన్‌ మార్టిన్‌ డెల్‌ పొట్రోతో

తలపడనున్నాడు. తాజా విజయంతో నాలుగో సారి యుఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచేందుకు ముందంజ వేశాడు. ఈ టైటిల్‌ గెలిస్తే అతడి కెరీర్‌లో 19వ గ్రాండ్‌స్లామ్‌ వచ్చిచేరుతుంది. మరోవైపు నాదల్‌కు గట్టి పోటీనిచ్చి ఐదు గంటల పాటు పోరాడి ఓడిన డొమినిక్ థీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

సెమీఫైనల్లోకి సెరెనా విలియమ్స్

ఇక, మహిళల సింగిల్స్‌లో ఆరు సార్లు ఛాంపియన్‌‌గా నిలిచిన సెరెనా విలియమ్స్‌ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌లో ఎనిమిదో సీడ్‌ కరోలినా ప్లిస్కోవాను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. ఈ యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్ స్లామ్‌ను గెలిస్తే సెరెనా ఖాతాలో 24 గ్రాండ్‌స్లామ్‌లు చేరతాయి. తద్వారా 24 గ్రాండ్ స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది.

Story first published: Wednesday, September 5, 2018, 16:32 [IST]
Other articles published on Sep 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X