న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెన్నిస్‌‌‌లో ఓ తరానికి ధ్రువతార లాంటి ప్లేయర్ సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్.. యూఎస్ ఓపెన్ తర్వాత బైబై

Tennis Star Serena Williams Says Good Bye, She confirms She Retires After US Open Grandslam

టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలకబోతున్నట్లు ప్రకటించింది. 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన సెరెనా ఒక ప్రముఖ మ్యాగజైన్‌ వోగ్‌లో ఈ విషయమై తన అభిప్రాయాలను వెల్లడించింది. తన రిటైర్మెంట్ విషయాన్ని వివరించింది. తన వీడ్కోలుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలిపింది. టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అయిన తర్వాత తనకు జీవితంలో ముఖ్యమైన విషయాలు ఉన్నాయని వాటి కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొంది.

ఒక ఏడాది పాటు టెన్నిస్ పోటీలకు దూరమైన సెరెనా ఇటీవలే గాయం నుంచి కోలుకుని గత జూన్‌లో జరిగిన వింబుల్డన్‌ పోటీల్లో ఆడింది. ఆమె సింగిల్స్‌లో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. 'నేను ఈసారి వింబుల్డన్ టైటిల్ గెలుచుకోలేదు. న్యూయార్క్‌లో జరిగే యూఎస్ ఓపెన్లో కూడా నేను టైటిల్ గెలుస్తానో లేదో కూడా నాకు కచ్చితంగా తెలియదు. కానీ నేను ప్రయత్నిస్తాను.' అని సెరెనా పేర్కొంది.

ఆమె అత్యధికంగా 6సార్లు యూఎస్ ఓపెన్‌ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ ఈ నెలలో ప్రారంభం కానుంది. అయితే కేవలం ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధిస్తే.. సెరెనా దిగ్గజ ప్లేయర్ మార్గరెట్‌ (24)టైటిళ్లతో సమమవుతుంది. కానీ చివరిగా యూఎస్ ఓపెన్లో ఆమె టైటిల్ గెలిచే ప్రదర్శన చేయగలదా అనేది సందేహమే.

చివరిసారిగా 2017లో సెరెనా టైటిల్ గెలిచింది. ఇక తాను రిటైర్మెంట్ చెబుతున్నట్లు ప్రకటించడానికి ఇష్టపడనని.. దానికి బదులు ఎవల్యూషన్ అనే పదాన్ని వాడి తాను టెన్నిస్ నుంచి వైదొలుగుతానని సెరెనా చెప్పింది. తన టైంను సెరెనా వెంచర్స్ డెవలప్ చేయడానికి అలాగే తన ఫ్యామిలీ కోసం కేటాయిస్తానని చెప్పింది.

Story first published: Tuesday, August 9, 2022, 22:32 [IST]
Other articles published on Aug 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X