న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేస్‌తో కలిసి అడనంటే ఆడను: మహేష్ భూపతి

By Pratap
Mahesh Bhupathi
బెంగళూరు: లియాండర్ పేస్‌పై భారత టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2012 ఒలింపిక్స్ క్రీడలలో లియాండర్ పేస్‌తో కలిసి ఆడాలనే ఐఎటిఎ ప్రతిపాదనకు ఆయనకు ససేమిరా అంటున్నారు. ఒలింపిక్స్‌లో జత కట్టాలనే కలను సాకారం చేసుకోవడానికి తాము 2011లో కలిసి ఆడామని, తనతో మాట మాత్రంగానైనా చెప్పకుండా పేస్ మరొకరితో జత కట్టాడని, దాంతో పేస్‌తో మరోసారి జత కట్టకూడదని నిర్ణయ తీసుకున్నానని, కలిసి ఆడడం మాట అటుంచి పేస్‌తో మాట్లాడడం కూడా తనకు ఇష్టం లేదని ఆయన అన్నారు.

జాగ్రత్తగా పరిశీలన చేసుకున్న తర్వాతనే పేస్‌తో జత కట్టకూడదని నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. యవనోత్తేజంలో ఉన్నప్పుడే విభేదాలను పక్కన పెట్టి కలిసి ఆడి విజయం సాధించలేకపోయామని, ఇప్పుడు అది జరుగుతుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.

తాను ఒలింపిక్స్‌కు వెళ్తే భారత్‌కు పతకం సాధించే ఏకైక లక్ష్యంతో వెళ్తానని, పేస్‌తో తాను ఆ పని చేయలేనని, రోహన్‌తో అయితే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ప్లే ఆఫ్‌లో 2004 ఏథెన్స్‌లో పేస్‌తో కాంస్య పతకాన్ని కోల్పోయిన రోజు అత్యంత దుర్దినమని, ఆ నష్టం నుంచి కోలుకోవడానికి తనకు చాలా కాలం పట్టిందని, ఇప్పుడు అత్యంత దుర్దశగా భావిస్తున్నానని ఆయన అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X