నా కుమారుడికి 16 రోజులు.. సానియాకు 16 ఏళ్లు: షోయబ్ ట్వీట్

హైదరాబాద్: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా గురువారం పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. సానియా తల్లయ్యాక ఇదే మొదటి పుట్టినరోజు కావడం విశేషం. కాగా, ఈరోజు వారి కుటుంబానికి మరింత ప్రత్యేకమైన రోజు. సానియా కుమారుడు ఇజాన్‌ పుట్టి 16 రోజులు అవుతోంది.

281 గొప్ప ఇన్నింగ్సే కానీ, సిడ్నీలో చేసిన 167 ఎంతో ముఖ్యం: లక్ష్మణ్

ఇక, సానియా తల్లి నసీమా మీర్జా పుట్టినరోజు కూడా ఈరోజే కావడం విశేషం. దీంతో మీర్జా కుటుంబం సంబరాల్లో మునిగితేలింది. ఈ సందర్భంగా సానియా భర్త, పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్ తన ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. "వేడుకల సమయం.. మా కుమారుడి వయసు 16రోజులు. ఇదే రోజు నా భార్య 16 ఏళ్ల అమ్మాయిలా మారిపోయింది. మా అత్తగారు కూడా" అని షోయబ్‌ ట్వీట్‌ చేశారు.

దీంతో పాటు షోయబ్ మాలిక్ తన కుమారుడు ఇజాన్‌, కుటుంబసభ్యుల ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. సానియా సోదరి ఆనమ్‌ మీర్జా కూడా సానియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ చిన్ననాటి ఫొటోను షేర్ చేయడం విశేషం.

View this post on Instagram

Happy birthday jaan ❤️

A post shared by Shoaib Malik (@realshoaibmalik) on

ఇదిలా ఉంటే సానియా మిర్జా, షోయబ్‌ మాలిక్‌ల వివాహం 2010, ఏప్రిల్‌ 12న జరిగింది. ఈ ఏడాది అక్టోబరు 30న సానియా మిర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సానియా తన కుమారుడికి ఇజాన్‌ మీర్జా-మాలిక్‌ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, November 16, 2018, 13:56 [IST]
Other articles published on Nov 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X