'పీవీ సింధూ ఆంటీ థ్యాంక్యూ'.. 'సో స్వీట్ సానియా మమ్మీ'

హైదరాబాద్: భారత టెన్నిస్ తార.. టెన్నిస్‌లో కొన్నేళ్ల పాటు శాసిస్తూ తెలుగు ఆటను దశదిశలా కొన్నేళ్ల పాటు చాటి చెప్పిన ప్లేయర్ సానియా మీర్జా కొద్ది రోజుల క్రితం ఓ కొడుక్కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా, క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ దంపతులు గత నెలలో మగ బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సానియా సొంతూరు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

సానియా తన కొడుకు ఇజాన్‌పై ఉన్న ప్రేమను, ఇతర విషయాలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంటూ ఆన్‌లైన్‌లో చురుకుగా స్పందిస్తూ వస్తున్నారు. బుధవారం తన బిడ్డను చూసేందుకు వచ్చిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధూ, స్క్వాష్‌ ప్లేయర్‌ జోత్స్న చిన్నప్పను ఉద్దేశిస్తూ సానియా సరదా ట్వీట్‌ చేసింది. ముగ్గురూ దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేసి తన బిడ్డను చూసేందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపింది.

ఈ ట్వీట్‌లో వైవిధ్యం ఏమిటంటే ఇద్దరినీ 'ఆంటీ'లుగా సంబోధించడం విశేషం. 'రాకెట్‌తో ఆడే ఆట స్పోర్ట్స్‌లో ఉత్తమమైన వాటిలో ఒకటి. ఇజాన్‌ను చూసేందుకు వచ్చినందుకు థాంక్యూ ఆంటీ సింధూ.. థ్యాంక్యూ ఆంటీ జేసీ ' అని సానియా ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

ఆ ట్వీట్‌కు బదులుగా పీవి సింధు ఇలా పేర్కొంది. 'ఆ.. దట్స్ సో స్వీట్ మమ్మీ(సానియా మీర్జా).. బేబీ ఇఝాన్ ఈజ్ రియల్లీ క్యూట్' సో స్వీట్ సానియా మమ్మీ.. బేబీ ఇఝాన్ చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ బదులిచ్చింది. టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు తిరిగి ఆటపై దృష్టిసారిస్తానని సానియా గతంలోనే ప్రకటించారు. గర్భధారణ, మాతృత్వం వల్ల తమ కలలకు దూరం కాకూడదని ఆమె గతంలో అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, November 29, 2018, 16:51 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X