న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండేళ్ల విరామం తర్వాత పునరాగమనాన్ని ఘనంగా చాటిన సానియా మిర్జా

Sania Mirza makes winning return to tennis court after a gap of 2 years

హైదరాబాద్: రెండేళ్ల సుదీర్ఘ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్‌లో పునరాగమనం చేసిన భారత తార సానియా మీర్జా అద్భుత ప్రదర్శన చేసింది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో మంగళవారం జరిగిన మహిళల డబుల్స్‌ ఈవెంట్‌లో సానియా మిర్జా జోడీ వొకసానా(జార్జియా)-మియూ కటో (జపాన్)ల జోడీపై గెలుపొందింది.

తాజా విజయంతో సానియా మిర్జా జోడీ ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత కోర్టులో అడుగుపెట్టిన సానియా మిర్జా ఉక్రెయిన్‌ అమ్మాయి నడియా కిచెనోక్‌తో జోడీ కట్టింది. వీరిద్దరి జోడీ 2-6, 7-6 (3), 10-3 తేడాతో ఒక్సానా కలష్నికోవా (జార్జియా), మియు కటొ (జపాన్‌) ద్వయంపై విజయం సాధించింది.

India vs Australia, 1st ODI: అరుదైన రికార్డుని మిస్సైన రోహిత్ శర్మIndia vs Australia, 1st ODI: అరుదైన రికార్డుని మిస్సైన రోహిత్ శర్మ

గంట 41 నిమిషాల పాటు సాగిన ఈ హోరా హోరీ పోరులో ఆద్యంతం సానియా మిర్జా జోడీదే పైచేయిగా నిలిచింది. క్వార్టర్స్‌లో సానియా జోడీ మెరికా జోడీ వనియా కింగ్‌, క్రిస్టినా మెక్‌హేల్‌తో తలపడనుంది. రెండేళ్ల విరామం తీసుకున్న సానియా చివరగా 2017, అక్టోబర్‌లో చైనా ఓపెన్‌ ఆడింది. మోకాలి గాయంతో ఆ టోర్నీ నుంచి తప్పుకుంది.

ఏప్రిల్ 2018లో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సానియా ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. కాగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు సానియా తన ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టింది. అందులో "నా జీవితంలోని ప్రత్యేకమైన రోజుల్లో ఇదొకటి. నా తల్లిదండ్రులు, నా కొడుకు చాన్నాళ్ల తర్వాత మ్యాచ్ ఆడుతుంటే నాతోపాటే వచ్చారు. తొలి రౌండ్ గెలిచాం. ఈ ప్రేమను పొందుతున్నందుకు చాలా గొప్పగా ఉంది. నమ్మకమనేది ఎలాంటి స్థానంలోనైనా కూర్చోబెడుతుంది. అవును నాన్నా మనం సాధించాం" అని సానియా మిర్జా కొడుకుతో ఉన్న ఫోటోని ట్వీట్ చేసింది.

Story first published: Tuesday, January 14, 2020, 15:28 [IST]
Other articles published on Jan 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X