కున్‌మింగ్‌ ఓపెన్‌ ఫైనల్లో ప్రజ్నేశ్‌

భారత మాజీ ఛాంపియన్, టెన్నిస్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నమెంట్‌లో టైటిల్‌ పోరుకు తొలిసారి అర్హత సాధించాడు. చైనాలో జరుగుతున్న కున్‌మింగ్‌ ఓపెన్‌లోప్రజ్నేశ్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఈ సంవత్సరం మూడు ఏటీపీ చాలెంజర్‌ టోర్నీల్లో పాల్గొన్న ప్రజ్నేశ్‌ రెండింటిలో సెమీస్‌ చేరుకున్నాడు. మరో టోర్నీలో రెండో రౌండ్‌లో ఓటమిని ఎదుర్కొన్నాడు.

శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రజ్నేశ్‌ 7-6 (7/5), 6-7 (3/7), 6-4తో పోలాండ్‌కు చెందిన ఆటగాడు కామిల్‌ మజార్జక్‌పై గెలుపొందాడు. 2 గంటల 48 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు ప్రజ్నేశ్‌ విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జే క్లార్క్‌ (బ్రిటన్‌)తో టైటిల్‌ పోరుకు సిద్దమయ్యాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, April 21, 2019, 9:20 [IST]
Other articles published on Apr 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X