న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

French Open 2021:జొకోవిచ్ చరిత్ర..నాదల్‌కు షాక్!తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోకి సిట్సిపాస్‌!

Novak Djokovic first player to beat Rafael Nadal twice at French Open to enters final

పారిస్‌ :వరల్డ్‌ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, సెర్బియా స్టార్ నొవాక్​ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ 2021 పురుషుల సింగిల్స్​ సెమీ ఫైనల్​లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్​ను ఓడించాడు. గత 16 సంవత్సరాల్లో ​నాదల్ ఇప్పటివరకు 13 సార్లు ఫ్రెంచ్​ ఓపెన్​ టైటిల్​ గెలుచుకోగా.. మూడోసారి మాత్రమే ఓటమిపాలయ్యాడు. నాలుగు గంటల కుపైగా సాగిన ఈ హోరాహోరీగా పోరులో 3-6, 6-3, 7-6(7/4), 6-2 తేడాతో జొకోవిచ్‌ అద్భుత విజయం సాధించాడు. దీంతో రొలాండ్‌ గారోస్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్‌)లో నాదల్​ను రెండు సార్లు ఓడించిన ఏకైక ఆటగాడిగా జకో నిలిచాడు.

కారును పంపించి మరి ద్రవిడ్‌ నాతో మాట్లాడాడు..అతని స్థానంలోనే నాకు ఆడే అవకాశం వచ్చింది:పాక్ మాజీ క్రికెటర్‌కారును పంపించి మరి ద్రవిడ్‌ నాతో మాట్లాడాడు..అతని స్థానంలోనే నాకు ఆడే అవకాశం వచ్చింది:పాక్ మాజీ క్రికెటర్‌

ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో జరిగిన 14 సెమీ ఫైనల్స్‌ మ్యాచుల్లో రఫెల్ నాదల్‌కు ఇది మొదటి ఓటమి. పారిస్‌లో జరిగిన ఎనిమిది మ్యాచుల్లో నాదల్‌తో నొవాక్ జొకోవిచ్‌ తలపడగా.. ఇందులో రెండు విజయాలు, ఫైనల్స్‌లో మూడు ఓటమలు ఉన్నాయి. నాదల్ తన అభిమాన టోర్నమెంట్‌లో ఓడిపోవడం ఇది మూడోసారి మాత్రమే. రెండు పరాజయాలకు జొకోవిచ్ కారణం. జొకోవిచ్ 2016లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. కరోనా నిబంధనల కారణంగా ఈ మ్యాచ్ కొద్దిమంది ప్రేక్షకుల ముందు జరగడం విశేషం.

గ్రీస్‌ కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ అదరగొట్టాడు. తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం ఐదు సెట్ల పాటు సాగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో అయిదో సీడ్‌ సిట్సిపాస్‌ 6-3, 6-3, 4-6, 4-6, 6-3తో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి సిట్సిపాస్‌దే దూకుడు. రెండో గేమ్‌లోనే జ్వెరెవ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన సిట్సిపాస్‌.. సెట్‌ గెలిచి ఆధిక్యంలో నిలిచాడు. రెండో సెట్లో జ్వెరెవ్‌ 3-0తో పైచేయి సాధించాడు. అనూహ్యంగా పుంజుకున్న సిట్సిపాస్‌ వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ కైవసం చేసుకున్నాడు. దూకుడు పెంచిన జ్వెరెవ్‌ ఆపై రెండు సెట్లు గెలిచాడు. నిర్ణయాత్మక ఐదవ సెట్లోనూ జ్వెరెవ్‌ జోరు కొనసాగింది. కానీ నెట్‌ గేమ్‌తో అదరగొట్టిన సిట్సిపాస్‌ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలోనే సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌ మూడున్నర గంటలకు పైగా సాగింది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్ ఈరోజు జరగనుంది. ఎవ్వరూ ఊహించని విధంగా అన్‌సీడెడ్‌ బార్బోరా క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌), 31వ సీడ్‌ అనస్తేసియా పవ్లిచెంకోవా (రష్యా) తమ కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో టైటిల్‌ పోరుకు చేరుకున్నారు. ఫైనల్లో గెలిచిన వారు తమ కెరీర్‌లో తొలిసారి సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరిస్తారు. 29 ఏళ్ల పవ్లిచెంకోవా 51 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడాక తొలిసారి గ్రాండ్‌ ఫైనల్లోకి అడుగుపెట్టగా.. డబుల్స్‌ స్పెషలిస్ట్‌ అయిన 25 ఏళ్ల క్రిచికోవా తన ఐదో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలిసారి సింగిల్స్‌ విభాగంలో ఫైనల్‌ చేరింది.

Story first published: Saturday, June 12, 2021, 8:54 [IST]
Other articles published on Jun 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X