న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'సెరెనా మ్యాచ్ లకు అంపైరింగ్ చేసేదే లేదు'

Naomi Osaka revealed what Serena Williams told her after the U.S. Open

హైదరాబాద్: అమెరికా అగ్రశ్రేణి టెన్నిస్‌ తార, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌ సెరెనా విలియమ్స్‌ ఆడే మ్యాచ్‌లకు అంపైర్లగా బాధ్యతలు నిర్వహించేది లేదని తేల్చి చెప్పారు అంపైర్లు. ఇందుకు కారణం ఆమె ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో చైర్‌ అంపైర్‌ రామోస్‌పై విరుచుకుపడటమే.

సెరెనాకు తొలి హెచ్చరిక జారీ చేసిన రామోస్‌..:

సెరెనాకు తొలి హెచ్చరిక జారీ చేసిన రామోస్‌..:

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి ఒసాకాతో సెరెనా తలపడింది. రెండో సెట్‌ రెండో గేమ్‌ సందర్భంగా సెరెనాకు ఆమె కోచ్ మౌరాత్‌గ్లో స్టాండ్స్‌ నుంచి సూచనలు చేస్తూ కనిపించాడు. ఇది గమనించిన చైర్‌ అంపైర్‌ రామోస్‌..సెరెనాకు తొలి హెచ్చరిక జారీ చేశాడు. దీనిపై ఆమె నిరసన వ్యక్తం చేసింది. ఆట తిరిగి ప్రారంభమయ్యాక ఒసాకా బ్రేక్‌ సాధించడంతో తీవ్ర అసహనానికి గురైన సెరెనా రాకెట్‌ను నేల కేసి కొట్టి దాన్ని విరగ్గొట్టింది.

 రెండో హెచ్చరిక జారీ చేయడంతో పాయింట్‌ కోత

రెండో హెచ్చరిక జారీ చేయడంతో పాయింట్‌ కోత

ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అంపైర్‌ సెరెనాకు రెండో హెచ్చరిక జారీ చేయడంతో పాటు ఓ పాయింట్‌ కోత పెట్టాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన సెరెనా.. గేమ్‌ విరామంలో రామోస్‌ను దొంగ అంటూ విరుచుకుపడింది. అంతేకాదు నా నుంచి పాయింట్‌ దొంగలించావు. ఇక నువ్వు బతికున్నంత కాలం నేనాడే మ్యాచ్‌లకు అంపైర్‌గా ఉండబోవు అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

 క్షమాపణ చెప్పేవరకు మ్యాచ్‌లను బహిష్కరించాలని:

క్షమాపణ చెప్పేవరకు మ్యాచ్‌లను బహిష్కరించాలని:

రామోస్‌ను ‘దొంగ, అబద్ధాల కోరు' అంటూ సెరెనా దూషించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఓ వర్గం అంపైర్లు... క్షమాపణ చెప్పేవరకు ఆమె పాల్గొనే మ్యాచ్‌లను బహిష్కరించే ఆలోచన చేస్తున్నారు. తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు సంఘంగా ఏర్పడాలని కూడా భావిస్తున్నారు.

 ప్రవర్తనా నియమావళిని సమీక్షించాలని అమెరికన్‌ టెన్నిస్‌

ప్రవర్తనా నియమావళిని సమీక్షించాలని అమెరికన్‌ టెన్నిస్‌

మరోవైపు 47 ఏళ్ల రామోస్‌ విశేష అనుభవజ్ఞుడు. పోర్చుగల్‌కు చెందిన ఇతడు పురుషుల సింగిల్స్‌ విభాగంలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌కు, మహిళల విభాగంలో మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌కు అంపైరింగ్‌ చేశాడు. తాజా వివాదాస్పద యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లోనూ రామోస్‌ నిబంధనలకు కట్టుబడ్డాడని అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) కితాబిచ్చింది. వరుస వివాదాల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని సమీక్షించాలని అమెరికన్‌ టెన్నిస్‌ సంఘం (యూఎస్‌టీఏ) భావిస్తోంది.

Story first published: Thursday, September 13, 2018, 10:11 [IST]
Other articles published on Sep 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X