న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, ఒలింపిక్స్‌లో జపాన్‌కు: ఒసాకా సంచలన నిర్ణయం

Naomi Osaka giving up US citizenship to play for Japan in 2020 Olympics: Media

హైదరాబాద్: నవోమి ఒసాకా... ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి దూసుకొచ్చిన యువ కెరటం. ఒసాకా అమ్మది జపాన్‌ కాగా.. నాన్నది హైతీ. ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అయితే, వచ్చే ఏడాది జరగనున్న ఒలింపిక్స్‌లో ఆమె అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని జపాన్‌కు ఆడనుంది.

ఈ విషయాన్ని ఒసాకానే స్వయంగా వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో తాను జపాన్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నట్లు ఒసాకా వెల్లడించింది. జపాన్‌లో పుట్టిన 21 ఏళ్ల ఒసాకా ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 16న ఒసాకా తన 22వ పుట్టినరోజుని జరుపుకుంటుంది.

IND vs SA 2nd Test: మయాంక్ అగర్వాల్ సెంచరీపై ఎవరేమన్నారు?IND vs SA 2nd Test: మయాంక్ అగర్వాల్ సెంచరీపై ఎవరేమన్నారు?

జపాన్‌ నిబంధనల ప్రకారం రెండు పౌరసత్వాలు ఉన్న వాళ్లు 22 ఏళ్లు దాటేలోపే ఒక పౌరసత్వాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒసాకా తన అమెరికా పౌరసత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఒసాకా మాట్లాడుతూ "నా దేశం జపాన్‌కు ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తా. ఒలింపిక్స్‌లో జపాన్‌కు ఆడబోతుండడం ప్రత్యేకమైన అనుభూతి" అని చెప్పింది.

జపాన్ ఎక్కువగా ఒసాకాను స్వీకరించినప్పటికీ, ఆమె ఇప్పటికీ కొంత వివక్షను ఎదుర్కొంటుంది. రెండు వారాల క్రితం, ఓ జపనీస్ కామెడీ జోడీ చేసిన వ్యాఖ్యలపై ఒసాకా నవ్వింది. ఒసాకా వడదెబ్బకు గురైందని, కొంత బ్లీచ్ అవసరమని సరదాగా ఈ జోడీ వ్యాఖ్యానించింది.

ఈ ఏడాది జనవరిలో జపనీస్ నూడిల్ కంపెనీ నిస్సిన్ సైతం ఓ వాణిజ్య ప్రకటనను సైతం తీసివేసింది. ఈ ప్రకటనలో ఒసాకాను వర్ణించే కార్టూన్ పాత్ర లేత చర్మం, లేత గోధుమ రంగు జుట్టుతో చూపబడింది. ఇది జపాన్ ప్రజల ఆగ్రహాన్ని గురికావడంతో ఈ కార్టూన్‌ను తొలగించివేశారు.

Story first published: Friday, October 11, 2019, 9:18 [IST]
Other articles published on Oct 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X